గత 75 ఏళ్లలో సూర్యకాంతం అనే చక్కటి పేరు పెట్టుకోకుండా చేసిన నటి..?

సినిమా రంగంలో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని, రాణించడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు.కొందరైతే తమకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటారు.

 Facts About Suryakantham , Suryakantham, Actor Gummadi Venkateswara Rao, Samsar-TeluguStop.com

ఎంతలా అంటే ఫలానా క్యారెక్టర్‌ వారు తప్ప మరెవరు చేయలేరనే రేంజ్‌లో వారు కొన్ని క్యారెక్టర్లకు అద్భుతంగా పోషిస్తారు.ఉదాహరణకి హీరోలకు తల్లి క్యారెక్టర్లలో నిర్మలమ్మ, అన్నపూర్ణ చక్కగా సరిపోతారు.

వారిని కాకుండా వేరే వారిని మనం ఊహించలేము.అయితే తల్లి పాత్రలకు వీళ్లు అద్భుతంగా సూట్ అయితే గడసరి అత్త పాత్రకు సూర్యకాంతం( Suryakantham ) సూట్ అయింది.

ఆమె నటించిన నటన ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత ముద్ర వేసింది.

సూర్యకాంతం పేరు, గొంతు వింటేనే చాలామందికి వణుకు వచ్చేస్తుంది.

ఎందుకంటే సినిమాల్లో కోడళ్లను రాచి రంపాన పెట్టే గయ్యాళి అత్తగా ఆమె భయపెట్టేది.‘సంసారం’ సినిమాలో మొదటిసారిగా అలాంటి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

అప్పటినుంచి ఆమెకు అన్నీ గయ్యాళి అత్త పాత్రలే వచ్చాయి.జోక్ ఏంటంటే, ఇప్పటివరకు సూర్యకాంతం అనే పేరు గల ఏకైక వ్యక్తిగా ఆమె నిలుస్తున్నారు.

ఆ సినిమాకి ముందు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సూర్యకాంతం పేరు పెట్టుకొని ఉండవచ్చు.కానీ, ఆమె సినిమాల్లో ఫేమస్ అయిన తర్వాత అంటే దాదాపు 75 ఏళ్లుగా ఏ తల్లిదండ్రులు కూడా ఆ పేరు తమ బిడ్డలకు పెట్టే ధైర్యం చేయలేదని చెప్పుకోవచ్చు.

సూర్యకాంతం చేసిన నెగిటివ్ రోల్స్ వల్ల ఆ పేరుకు కూడా ఒక నెగిటివిటీ అనేది వచ్చేసింది.అంటే ఆమె పేరు పెడితే అమ్మాయిని అందరూ చెడుగా, గయ్యాలి దానిలాగా చూస్తారేమో అని తల్లిదండ్రులు భయపడ్డారు.ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో యాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ( Actor Gummadi Venkateswara Rao )సూర్యకాంతంతో మాట్లాడుతూ “నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది.‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు” అని అన్నారట.ఆ మాట సరదాగా అన్నా అందులో నిజం ఉంది.

Telugu Suryakantham, Samsaram-Movie

సూర్యకాంతం.ప్రతి సినిమాలోనూ కోడల్ని హింసించడం, భర్తలను, ఇతరులను బాధపెట్టడం వంటి పాత్రలే చేశారు.నిజ జీవితంలో ఆమె ఏదైనా శుభకార్యానికి వెళ్లినా ఆమె దగ్గరికి ఎవరూ వెళ్లే సాహసం చేసేవారు కాదు.

కనీసం ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి మేడం అని కూడా అడిగే ధైర్యం చేసేవారు కాదట.సూర్యకాంతం చాలా అద్భుతమైన నటి.చాలా సహజంగా నటిస్తుంది.పాత్రలకు జీవం పోస్తుంది.

అందుకే ఆమె పాత్రలు ప్రజలందరిపై అంతటి ప్రభావాన్ని చూపాయి.

Telugu Suryakantham, Samsaram-Movie

పని మనుషులు కూడా సూర్యకాంతం ఇంట్లో పనిచేయడానికి వచ్చేవారు కాదట.ఓసారి ఫ్రెండ్ ద్వారా ఒక పని మనిషిని పనిలో పెట్టుకోవాలనుకుంది సూర్యకాంతం.అయితే ఆ విషయం తెలియక ముందు పనిమనిషి ట్రైన్ ఎక్కిందట.

తర్వాత సూర్యకాంతం దగ్గర పనిచేయాల్సి వస్తుంది అని తెలిసి ఇంకో ట్రైన్ ఎక్కి తన ఇంటికి పారిపోయిందట.నిజం చెప్పాలంటే నిజ జీవితంలో సూర్యకాంతం అంత మంచి మనిషి మరొకరు ఉండరు.

ఆమె చాలా సౌమ్యురాలు, సున్నితమైన మనసు గలవారు.ఆమెతో కలిసి నటించిన వారికి, అలాగే ఆమెతో దగ్గరగా మిగిలిన వారికి ఈ విషయం తెలుస్తుంది.

సినిమాలో ఆమె వేరే పాత్రలపై విరుచుకుపడుతుంది, ఆ షాట్ అయిపోగానే వారికి క్షమాపణలు కూడా చెప్పేదట.ఓసారి నాగయ్యను ఎంతో కోపంగా తిట్టే సన్నివేశంలో నటించింది సూర్యకాంతం.

ఆ షాట్ అయిపోగానే ఆయన కాళ్లకు నమస్కరించి క్షమించమని అడిగిందట.దాంతో నాగయ్య ఆమె మంచి మనసుకు ఆశ్చర్యపోయారట.

ఇంకా సూర్యకాంతానికి చాలా దయాగుణం ఎక్కువ అని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube