అలీ సలహాతో బన్నీకి పెద్ద డిజాస్టర్ తప్పింది.. ఏ సినిమా అంటే..

గంగోత్రి సినిమా( Gangotri movie ) నుంచి పుష్ప సినిమా దాకా అల్లు అర్జున్( Allu Arjun ) ఎదిగిన తీరు అందరికీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పుకోవచ్చు.గంగోత్రి మూవీలో నిక్కర్ వేసుకుని ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడి లాగా కనిపించాడు బన్నీ.

 How Disaatw Rolled Out Due To Ali , Gangotri Movie, Allu Arjun, Sukumar, arya 2-TeluguStop.com

అప్పట్లో అతడి అవతారాన్ని చాలామంది ట్రోల్ కూడా చేశారు.అయితే రెండో సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించి అందరూ ముక్కున వేలేసుకునేలాగా చేశాడు బన్నీ.

విమర్శించిన వారే అతన్ని చూసి ఎలా స్టైల్ గా ఉండాలో నేర్చుకున్నారు.ఆ సెకండ్ మూవీ మారేదో కాదు సుకుమార్( Sukumar ) తీసిన ఆర్య.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ చాలా మందికి నచ్చింది.

దీని తర్వాత మళ్లీ “ఆర్య 2” సినిమా ( “Arya 2” movie )కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు.ఈ మూవీ కూడా చాలామందికి నచ్చింది.ఇందులో బన్నీ కరెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది.ఆ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ చాలా బాగా నటించి ప్రశంసలు అందుకున్నాడు.

ఇందులోని పాటలు కూడా చాలా బాగుంటాయి.కాజల్ అగర్వాల్ ఈ సినిమా తర్వాతే అందరికీ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

ముచ్చటగా మూడోసారి కలిసి వీరు చేసిన సినిమా పుష్ప.ఇది పాన్ ఇండియా హిట్ అయింది.

దీనికి సీక్వెల్ కూడా వస్తోంది.దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుష్ప మూవీతో బన్నీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.పాన్ ఇండియా హీరోలలో ముందు వరుసలో నిలుస్తున్నాడు.

Telugu Allu Arjun, Arya, Devaraj, Gangotri, Disaatwrolled, Sukumar, Upendra-Movi

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా మూడు సినిమాలు తీశాడు.జులాయి, అల వైకుంఠపురములో, సన్నాఫ్ సత్యమూర్తి వీరి కాంబోలో వచ్చిన సినిమాలు.2020లో సంక్రాంతి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయింది.సన్నాఫ్ సత్యమూర్తి కూడా హిట్ అయింది.

అయితే ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయి ఉండేదట.కానీ ఆ మూవీ డిజాస్టర్ కాకుండా బన్నీ కెరీర్ ని కమెడియన్ అలీ కాపాడాడు.

కమెడియన్ అలీ ఇచ్చిన ఒక మంచి సలహా వల్లనే ఈ మూవీ పెద్ద హిట్ అయింది.

Telugu Allu Arjun, Arya, Devaraj, Gangotri, Disaatwrolled, Sukumar, Upendra-Movi

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర “దేవరాజ్ నాయుడు”( Devaraj Naidu ) అనే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు.ఈ సినిమాలో ఆయన పాత్రకి ఇచ్చిన వాయిస్‌లో చాలా బేస్ ఉంటుంది.అదే ఆ పాత్రకు మెయిన్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు.

అయితే మొదట్లో ఈ క్యారెక్టర్ కు ఉపేంద్రనే డబ్బింగ్ చెప్పాడట.దాన్ని విని అలీకి నచ్చలేదట.

సినిమాలో ఉపేంద్ర పాత్ర చాలా కీలకమైనది.అలాంటి పాత్రకి ఇలాంటి వాయిస్ ఉంటే మూవీ మొత్తం పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని అలీ భావించాడు.

అందుకే వెంటనే ఈ విషయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెవిన పడేశాడు.అప్పటికి గానీ త్రివిక్రమ్ అలర్ట్ కాలేదు.

వెంటనే వాయిస్ ఆర్టిస్టు రవిశంకర్ ని పిలిపించి ఉపేంద్ర పాత్రకు చక్కగా డబ్బింగ్ చెప్పించాడు.అతని గంభీరమైన వాయిస్, ఉపేంద్ర టెరిఫిక్ యాక్టింగ్ రెండూ బాగా సూట్ కావడం వల్ల ఈ మూవీ మరో రేంజ్ లో ఎలివేట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube