బొప్పాయి తినటం వలన కలిగే సైడ్ ఎఫక్ట్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

బొప్పాయిలో ఎన్నో పోషకాలు మరియు తీపి రుచిని కలిగి ఉండుట వలన అందరు ఇష్టంగా తింటారు.బొప్పాయిలో కేలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

 13 Severe Side Effects Of Papaya-TeluguStop.com

అలాగే బొప్పాయిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.బరువు తగ్గటానికి ప్రయత్నం చేస్తున్న వారికీ బొప్పాయి మంచి డైట్ అని చెప్పవచ్చు.

బొప్పాయిని లిమిట్ గా తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.అదే అతిగా తీసుకుంటే మన శరీరం మీద చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన కడుపు ఉబ్బరం ,గ్యాస్ సమస్యలు,కడుపు అప్ సెట్ ,అపానవాయువు, వికారం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన బొప్పాయిలో ఉండే విటమిన్ సి కిడ్నీలో రాళ్ళూ ఏర్పడే అవకాశం ఉంది.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ చర్మ రంగులో అసహజమైన మార్పు వస్తుంది.ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో కెరోటినిమా అని అంటారు.

ఈ పరిస్థితిలో కళ్ళు పాలిపోవటమే కాకుండా అరచేతులు పసుపుగా మారతాయి.అప్పుడు కామెర్లు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి

బొప్పాయిని ఎక్కువగా తీసుకోవటం వలన దానిలో ఉండే లాక్టేషన్ వలన గర్భిణీ స్త్రీలలో అబార్షన్ కి కారణం అవుతుంది.

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ శక్తివంతమైన అలర్జిమస్ గా పనిచేసి శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.

బొప్పాయి రక్తంను పలుచగా మారుస్తుంది.

అలాగే బ్లడ్ క్లాట్స్ ని తగ్గిస్తుంది.అదే ఎక్కువగా తీసుకుంటే రక్తాన్ని పసుపుగా మారుస్తుంది.

పాలు ఇచ్చే తల్లులు పచ్చి బొప్పాయిని తింటే పాలు బాగా పడతాయని మన పెద్దవారు పచ్చి బొప్పాయిని ఎక్కువగా పెడుతూ ఉంటారు.కానీ పచ్చి బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ బిడ్డ మీద నెగిటివ్ ప్రభావంను కలిగిస్తాయని పరిశోధనలో తేలింది.

బొప్పాయి ఎక్కువగా తినటం వలన చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

శ్వాస సమస్యలు,ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు బొప్పాయిని తింటే బొప్పాయిలో ఉండే పెపైన్ హార్ట్ బీట్ ను తగ్గిస్తుంది.దాంతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

బొప్పాయిని డయోరియా సమయంలో తీసుకుంటే పరిస్థితి తీవ్రం అయ్యి డీహైడ్రేషన్ కు గురి అవుతారు.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం చిన్న పిల్లలకు ఇవ్వమని డాక్టర్స్ చెప్పుతూ ఉంటారు.

ఫైబర్ ఎక్కువగా ఉన్న బొప్పాయిని ఎక్కువగా పెడితే చిన్న పిల్లలలో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి.

మలబద్దకం నివారించుకోవడానికి బొప్పాయి గ్రేట్ రెమెడీ.

అయితే ఎక్సెస్ గా తీసుకుంటే, నెగటివ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.బొప్పాయి తిన్నప్పుడు, లేదా మలబద్దకంతో బాధపడే వారు 10 నుండి 12 గ్లాసుల మంచి నీరు తాగడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube