రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనేసిన ఘనుడు.. ఎలా అంటే?

ప్రస్తుత రోజులలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు చాలా తక్కువ అయిపోయారు.చాలావరకు అందరూ ఐఫోన్లు కొనాలని అనేక ప్రయత్నాలు చేయడం చేస్తున్నారు.

 Iphone 16 Iphone At Just Rs 27,000 Details, 16 ,at Just Rs 27,000,here's, How ,-TeluguStop.com

ఇక మరికొందరు అయితే ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ ఫోన్స్ ను కొనుగోలు చేసుకునేందుకు డబ్బులను లేకపోయినా కూడా అప్పు చేసి మరి కొనుగోలు చేస్తున్నారు.అయితే, తాజాగా ఆపిల్ ఐఫోన్ 16( iPhone 16 ) సిరీస్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ఫోన్ కోసం విడుదలైన రోజు నాడు ముంబైలో ప్రముఖ యాపిల్ స్టోర్ వద్ద ఎలాంటి సందడి ఉందో అందరం సోషల్ మీడియా ద్వారా చూసాము.అయితే ఈ ఐఫోన్ మన భారతదేశంలో.iPhone 16 ధర ప్రస్తుతం రూ.79,900 కాగా, iPhone 16 256 GB వేరియంట్ ధర రూ.89,900 ఉండగా ఈ మోడల్ ఐఫోన్ ను ఒక వ్యక్తి కేవలం 27 వేల రూపాయలకే కొనుగోలు చేశాడు.ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Telugu Rs, Hdfc Credit, Iphone, Latest-Latest News - Telugu

ఇక ఆ వ్యక్తి ఐఫోన్ 16 ని అంత చౌకగా ఎలా కొనుగోలు చేశాడో.ఒక ట్రిక్ ద్వారా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ రూ.89,900 ఫోన్ ను 27 వేలకే రివార్డ్ పాయింట్స్ లను ఉపయోగించి ఈ ఫోను తక్కువగా తీసుకోగలిగానని తెలిపాడు.ఇకపోతే ప్రస్తుత రోజులలో చాలావరకు బ్యాంకుల ప్రతి కొనుగోలు పై కొన్ని వాల్యూ యాడెడ్ పాయింట్లు ఇస్తున్నాయి.వాటిని ఉపయోగించి మనం తీసుకోండి.కూపన్లలో లేదా నగదు రూపంలో ఇలా వాడుకోవచ్చు అంటూ తెలియచేసాడు.అంతేకాకుండా ఈ ఐఫోన్లు కొనేందుకు ఆ వ్యక్తి దాదాపు 62 వేలకు పైగా రివార్డు పాయింట్లు ఉపయోగించినట్లు సమాచారం.

దీంతో ఐఫోన్ ధర గణనీయంగా చాలా వరకు తగ్గిపోయింది.

Telugu Rs, Hdfc Credit, Iphone, Latest-Latest News - Telugu

ఇక ఈ పోస్ట్ ను చూసిన కొంతమంది నెటిజన్స్.62,930 రివార్డ్ పాయింట్లు ఆ వ్యక్తి పొందడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అంటూ కామెంట్ చేయగా.దీనికి సదరు వ్యక్తి స్పందిస్తూ.

ఐఫోన్ 16 కనుగోలు చేసిన వినియోగదారు 15 లక్షల రూపాయలు అని పేర్కొన్నాడు.ఆ వ్యక్తి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్( HDFC Credit Card ) ద్వారా 15 లక్షల విలువగల విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

అందుకే అన్ని రివార్డు పాయింట్లు వచ్చాయని… అందుకే అతను డిస్కౌంట్ లో ఐఫోన్ 16 ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు.ఇక ఈ పోస్ట్ ని చూసిన కొంతమంది వివిధ రకాలుగా వారి అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube