మన తెలుగు రాష్ట్రాలలో చాలా మంది యువత పొరుగు దేశాలకు జీవనోపాధి కొరకు వెళ్తున్నారు.ఇలా వెళ్లినవారు చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కోవడంతోపాటు, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
అచ్చం అలంటి సంఘటన ఒకటి తెలంగాణకు చెందిన ఒక యువకుడికి ఎదురయింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు ఉపాధి కోసం ఇరాన్ దేశానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు.ఈ క్రమంలో ఒక ప్రముఖ ఏజెంట్ అధిక వేతనం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి అతని దగ్గర దాదాపు 2.7 లక్షల రూపాయలు తీసుకున్నాడు .

అయితే., ఇరాక్( Iraq ) కు వెళ్లిన అనంతరం ఆ ఏజెంట్ తనను మోసం చేశాడని పాస్ పోర్ట్ తీసుకొని ఒక గదిలో బంధించి అనేక ఇబ్బందులు తల పెడుతున్నాడని ఆ యువకుడు తెలిపాడు.అంతేకాకుండా తినడానికి తిండి కూడా లేదని రోజుకు ఒక్క పూట మాత్రమే తింటున్న అని.కొన్ని కొన్ని సందర్భాలలో ఆ ఒక్క పూట కూడా తినడానికి తిండి లేకుండా పస్తులు ఉంటున్నానని అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.అలాగే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను.
తనను ఎలాగైనా మన దేశానికి రప్పించండి అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నాడు.ఇందుకు సంబందించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.

అనేకమంది స్పందిస్తూ.యువకుడిని వెంటనే ఇండియా( India )కు తీసుకొని రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddyని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నాయకులను ట్యాగ్ చేస్తున్నారు.ఈ క్రమంలో బాధితుడు తల్లిదండ్రులు కూడా కాస్త తమ కుమారుడి పట్ల దయ చూపించి స్వదేశానికి తీసుకొని రావాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.ఇలా తెలుగు దేశాలలో అనేక మంది ఉద్యోగాల కోసం వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాకపోతే, కొందరివి మాత్రమే ఇలా బయటకు విషయాలు వస్తున్నాయి.ఇంకా ఇలాంటి వారు ఎంత మంది ఉన్నారో కూడా అర్థం అవ్వడం లేదు.







