అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్( S Iswaran )కు న్యాయస్థానం ఇటీవల 12 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.ఆయనకు చాంగీ జైలులో 6.9 చదరపు మీటర్లు మాత్రమే ఉండే సింగిల్ సెల్‌ను కేటాయించారు.పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యునిగా మూడు దశాబ్థాలుగా రాజకీయాల్లో ఉన్న 62 ఏళ్ల ఈశ్వరన్‌కు భద్రతా కారణాల రీత్యా సోమవారం సింగిల్ సెల్ అందించినట్లు సింగపూర్ జైలు సర్వీస్ తెలిపింది.
శిక్షా సమయంలో ఆయన కప్పుకోవడానికి ఒక గడ్డి చాప, రెండు దుప్పట్లను కూడా అందజేశారు.
ఖైదీలందరికీ రోజువారీ జీవన అవసరాలైన టూత్ బ్రష్, టూత్ పేస్ట్, దుస్తులు, చెప్పులు, టవల్, భోజనం కోసం ప్లాస్టిక్ చెంచా అందిస్తామని అధికారులు తెలిపారు.ఖైదీలు తమ కుటుంబ సభ్యులు, ఇతర ఆత్మీయులతో మాట్లాడేందుకు , టెలి విజిట్‌లు, ఈ లేఖల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.జైలుకు వెళ్లేముందు ఈశ్వరన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గడిచిన 3 దశాబ్థాలుగా నా నియోజకవర్గాలకు, సింగపూర్ ప్రజలకు సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని ఆయన అన్నారు.
కాగా.బ్రిటన్( Britain )లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజిక్ కన్సర్ట్‌లు, సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ టికెట్‌లు సహా పలు వస్తువులను సింగపూర్ వ్యాపారవేత్త ఓంగ్ నుంచి ఈశ్వరన్ పొందినట్లుగా అభియోగాలు మోపారు.ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్లలో దాదాపు 4,03,300 సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులు పొందినందుకు గాను హైకోర్ట్ ( High Court )ఈశ్వరన్‌కి 12 నెలల జైలుశిక్ష విధించింది.సింగపూర్‌లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి రాజీనామా చేసిన ఈశ్వరన్ జనవరి 16న రవాణా మంత్రి పదవితో పాటు తన పార్లమెంటరీ స్థానానికి కూడా రాజీనామా చేశారు.1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికై ఆయన 2006లో మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.