ఎప్పటి నుంచో తెలంగాణలో టిడిపిని బలోతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) భావిస్తూనే వస్తున్నారు.దానిలో భాగంగానే బలమైన నేతలకు తెలంగాణ టిడిపి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినా వారు కొంతకాలానికి పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిపోతూ ఉండడం వంటివి సర్వసాధారణంగా మారాయి.
ఇక పేరున్న నేతలు ఎవరూ తెలంగాణ టిడిపిలో లేకపోవడంతో అక్కడ పార్టీ పుంజుకోవడం కష్టమనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు.క్షేత్రస్థాయిలో టిడిపికి కేడర్ ఉన్నా , నడిపించే నాయకులు కరువడంతో తెలంగాణలో టిడిపి పై దాదాపుగా చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నారు.
అయితే ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ టడిపిలోకి వలసలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొంతమంది టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
వీరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ( Teegala Krishna Reddy)వంటి వారు ఉన్నారు.
టిడిపిలో చేరిపోతున్నట్లుగా తీగల ఇప్పటికే ప్రకటించేశారు.మల్లారెడ్డికి తెలంగాణ టిడిపి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి పుంజునే అవకాశం లేదనే అంచనాకు వచ్చారు.
అందుకే తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరుతానన్నా తర్వాత మాట్లాడదామని దాట వేయడానికి కారణమట.ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు చూస్తే .
టిడిపికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు.బిఆర్ఎస్ ప్రస్తుతం బలహీనమైనట్లు కనిపిస్తున్నా, తెలంగాణ సెంటిమెంట్ ఉండడం వంటివి బిఆర్ఎస్( BRS ) కు కలిసి వస్తాయి.బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేవారు బిజెప కాంగ్రెస్ లలోనే చేరుతున్నారు . బీ ఆర్ ఎస్ బలహీన పడినా, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కేడర్ టిడిపిలో చేరినా, అది కొంతకాలమే అన్నట్లుగా ఉండడం గతం నుంచి వస్తూనే ఉంది.టిడిపికి ఏపీ పార్టీగా తెలంగాణలో ముద్ర పడడంతో, ఆ పార్టీ ఎక్కదా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.ఇక హైదరాబాద్ పరిధిలో టిడిపి ప్రభావం చూపుతోందా అంటే అక్కడ టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా, టిడిపికి ఓటు వేసినా ప్రయోజనం ఏమిటనే అభిప్రాయంతో ఉన్నవారే ఎక్కువగా ఉండడంతో, వారు ఇతర పార్టీలవైపే మొగ్గు చూపిస్తున్నారు .అలాగే టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు ఇతర పార్టీలేవీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ఆంధ్ర ముద్ర ఉండడం తమకు నష్టం చేకూరుస్తుందనే ఉద్దేశంతో ప్రధాన పార్టీలు ఉండడంతో, ఆ పార్టీ వైపు ఏ పార్టీ ఆసక్తి చూపించడం లేదు.
తెలంగాణలో టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన జ్ఞానేశ్వర్ ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు.ఇక ఆ తర్వాత నుంచి ఎవరినీ తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించలేదంటే తెలంగాణలో టిడిపి కోలుకోవడం కష్టమనే అభిప్రాయం చంద్రబాబుకు ఉందనే విషయం అర్థం అవుతోంది.