మలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ ( Mohan Lal )కి సపరేట్ క్రేజ్ అయితే ఉంది.అడపాదడపా ఆయన తెలుగులో కనిపించినప్పటికీ ఇక్కడ కూడా ఆయనకి మంచి మార్కెట్ క్రియేట్ అయింది.
ఇక జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన మోహన్ లాల్ ఆ సినిమా ద్వారా భారీ గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు.ఇక మలయాళం సినిమా( Malayalam movie ) ఇండస్ట్రీలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నాడు.
ఇక కంప్లీట్ యాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.ఆయన ఏ క్యారెక్టర్ లో అయిన సరే కంప్లీట్ గా లీలమైపోయి నటిస్తాడు అనేది ఆయన సినిమాలను చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది.
ఇక ప్రస్తుతం ఈయన కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈయనతో సినిమాలు చేయడానికి తెలుగు స్టార్ట్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తుండడం విశేషము ఇక ప్రస్థానంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దేవకట్ట మోహన్ లాల్ ను లీడ్ రోల్ లో పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
గతంలో చంద్రశేఖర్ ఏలేటి లాంటి గొప్ప దర్శకుడు కూడా మోహన్ లాల్ తో ‘మనమంతా’ అనే ఒక సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన బాటలోనే దేవకట్టా ( Devakatta )నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఒక డిఫరెంట్ కథతో రావడమే కాకుండా తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ ను ప్రేక్షకుల్లో నింపుతున్నారు.మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ప్రస్తుతం దేవకట్టా కి పెద్దగా సక్సెసులు అయితే లేవు.

తను సాయి ధరమ్ తేజ్ తో చేసిన రిపబ్లిక్ అనే సినిమా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు.ఇక విమర్శకులు సైతం ఈ సినిమాకి ప్రశంసల వర్షం కురిపించారు.ఇక ఏది ఏమైనా కూడా దేవ కట్టా లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే తనకంటే వెనక వచ్చిన దర్శకులు కూడా స్టార్ డైరెక్టర్లు గా మారిపోయి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం ఇంకా తనను తాను ఎలివేట్ చేసుకోవడంలోనే స్ట్రగుల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…
.