నిజ్జర్ హత్య కేసు : భారత్ ప్రమేయం ఉందా , లేదా.. నివేదిక కోసం కెనడా ప్రభుత్వం నిరీక్షణ

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుపై కెనడా ప్రభుత్వం( Canada Governement ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22) అనే భారతీయులను నిజ్జర్ కేసులో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 Canadian Govt Awaits Results Of Probe On Link Between Indian Agents And Nijjar K-TeluguStop.com

ఈ దర్యాప్తు ఫలితాల కోసం కెనడా ప్రభుత్వం ఉత్కంఠగా వెయిట్ చేస్తోంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల( Indian Agents ) హస్తం ఉందంటూ గతేడాది సెప్టెంబర్ 18న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో( PM Justin Trudeau ) చేసిన ఆరోపణలు దుమారం రేపగా.

భారత్ – కెనడా మధ్య ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం చూపింది.గ్లోబల్ అఫైర్స్ కెనడాలో ఇండో – పసిఫిక్ ప్రాంతాల అసిస్టెంట్ డిప్యూటీ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న వెల్డన్ ఎప్( Weldon Epp ) శుక్రవారం ఫారిన్ ఇంటర్‌ఫియరెన్స్ కమీషన్ ముందు హాజరయ్యారు.

Telugu Canadian, Hardeepsingh, Indian, Khalistan, Khalistantiger, Nijjar, Royal

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) ద్వారా నిజ్జర్ కేసుపై దౌత్యపరంగా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన కమీషన్‌కు తెలియజేశారు.నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా అందకపోవడంతో ఆర్‌సీఎంపీ విచారణ ముగిసే వరకు తాము వెయిట్ చేస్తామని వెల్డన్ అన్నారు.గత వారం సీనియర్ ఆర్‌సీఎంపీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.నిజ్జర్ హత్యపై భారత్ జోక్యంపై కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక పరిశోధనలు చేస్తోందన్నారు.

Telugu Canadian, Hardeepsingh, Indian, Khalistan, Khalistantiger, Nijjar, Royal

ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యంపై విచారణకు హాజరైన సందర్భంగా ఆర్‌సీఎంపీ డిప్యూటీ కమీషనర్ మార్క్ ఫ్లిన్ ఈ విషయాన్ని తెలిపారు.అవసరమైతే భారత ప్రభుత్వాన్ని కూడా తాము విచారిస్తామని ఆయన పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా.నిజ్జర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయుల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది.సర్రే ప్రొవిన్షియల్ కోర్ట్ న్యాయమూర్తి జోడీ హారిస్.ఈ కేసును నవంబర్ 21కి వాయిదా వేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

నిజ్జర్ కేసులో విచారణ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇది ఐదవసారి వాయిదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube