ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy Temple ) టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతిరోజు కూడా లక్షలమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి భక్తుల కోసం ప్రసాదంగా అందించే లడ్డు, వడకు ప్రత్యేక స్థానం ఉంది.చాలామందికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం.
ఈ క్రమంలో తాజాగా తిరుపతి లడ్డు తయారీ విధానాలలో కాస్త మార్పులు రాబోతున్నట్లు తెలుస్తుంది.ఇకనుంచి ఈ లడ్డును కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్( Karnataka Milk Federation ) తో టీడీపీ బృందం ఒప్పందం కూడా కుదుర్చుకుంది.ఈ క్రమంలో ఏకంగా 350 టన్నుల నెయ్యి సరఫరా కోసం ఒప్పందం కూడా పూర్తయింది.ఒప్పందం పూర్తి అయిన అనంతరం ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం కూడా మొదలు పెట్టేసింది.వాస్తవానికి ఇలా మార్పులు జరగడానికి ముఖ్య కారణం లడ్డూలలో నెయ్యి రుచి పై నిరంతరం ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే నెయ్యి నాణ్యత పై ఫిర్యాదుల విషయంలో టిటిడి అధికారులు పాత విక్రేతకు చాలా సార్లు హెచ్చరించిన ఎటువంటి ఫలితం లేకపోలేదు.
అందుకోసమే ఈ తదుపరి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ( TTD ) వారు తెలియజేస్తున్నారు.ఇక ఇప్పటినుంచి తిరుపతి లడ్డు ప్రసాదం కోసం నందిని నెయ్యితో మాత్రమే లడ్డూలు తయారు చేస్తారని, అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రధాన ఆలయాలలో కూడా ఇదే వర్తిస్తుందని టీటీడీ అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం తిరుమల తిరుపతిలో భక్తుల కోసం మూడున్నర లక్షల లడ్డూలను టీటీడీ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు సమాచారం.
నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఒక మంచి సంస్థగా పేరు సొంతం చేసుకున్న నందిని డైరీనే అని టిటిడి అధికారులు తెలియచేస్తున్నారు.అంతేకాకుండా బెంగళూరులోని మిల్క్ టెక్స్టింగ్ లాబరేటర్ లో ఈ కంపెనీ తయారుచేసిన నెయ్యి నాణ్యతను టీటీడీ అధికారులు స్వయంగా పరిశీలన కూడా చేశారు.