యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Ntr ) కొరటాల శివ( Koratala Shiva ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం దేవర( Devara ) .ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దావూదీ.దావూదీ అంటూ సాగిపోయే ఈ పాటను ఇటీవల విడుదల చేయగా ఈ పాట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు ఎన్టీఆర్ కూడా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి.అయితే కొంతమంది ఈ పాట కాపీ అంటూ కామెంట్లు చేస్తున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఈ పాట చాలా అద్భుతంగా ఉందని ఈ పాట కోసం ఎన్టీఆర్ పడిన కష్టాన్ని కూడా గుర్తిస్తూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ పాట గురించి సినిమాటోగ్రాఫర్ రత్న వేలు ( Rathnavelu )కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే అయినప్పటికీ కూడా ఈయన ఈ పాటకు డాన్స్ చేయడం గురించి రత్నవేలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కండరాల నొప్పి, గాయంతో బాధపడుతున్నా కూడా ఇలాంటి ఫాస్ట్ బీట్ సాంగ్‌కి ఇంత ఈజీగా స్టైలిష్‌గా తారక్ డ్యాన్స్ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది.నిజంగా నీకు హ్యాట్సాఫ్ అంటూ ఈయన ట్వీట్ చేసారు.ఇక ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ పోస్ట్ పై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.సాధారణంగా ఎన్టీఆర్ వేసే స్టెప్పులు చాలా కష్టంగా ఉంటాయి.అలాంటిది ఈయనకు గాయం తగిలిన ఆ నొప్పిని భరిస్తూ డాన్స్ చేశారు అంటే ఈయన డెడికేషన్ కు హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.