డార్లింగ్ ప్రభాస్( Darling Prabhas ) హీరోగా నటించిన చిత్రం కల్కి( Kalki ).ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన కల్కి సినిమా అంతకు రెట్టింపు ఫలితాలను అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోయింది.బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.
ఇకపోతే ఎక్కడికి సినిమా ఇటీవలె ఓటీటీలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.థియేటర్ లలో భారీ సక్సెస్‌ను అందుకున్న కల్కి సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలన విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.
జూన్‌లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ( OTT )వేదికగా ప్రసారమవుతోంది.అమెజాన్, నెట్‌ఫ్లిక్స్( Amazon, Netflix ) లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా గ్లోబల్ రేంజ్లో సత్తా చాటింది.ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్ లో దీని హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.అప్పటి నుంచి అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో కొనసాగుతూనే ఉంది.తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.దీంతో గ్లోబల్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది.రెండు వారాల్లో 7.1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.విడుదలైన మొదటి వారంలోనే 2.6 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.
ప్రస్తుతం ఈ చిత్రం నాన్ ఇంగ్లిష్ విభాగంలో నెట్‌ఫ్లిక్స్ లో టాప్ వన్‌లో ఉంది కల్కి చిత్రం.ఇలా ఓటీటీలో కూడా సంచలన రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్.అటు కెరియర్ పరంగా సక్సెస్ అవుతూనే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా హీరో అనిపించుకుంటున్నారు ప్రభాస్.మరి ముందు ముందు కల్కి సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.ఇకపోతే ఈ సినిమా చివర్లో ఈ సినిమాకు పార్ట్ టు ఉంటుంది అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే అందుకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ఇటీవల మూవీ మేకర్స్ తెలిపారు.
వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.