అమెరికాలో స్టాలిన్ సైకిల్ సవారీ.. వీడియో వైరల్

ప్రస్తుతం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌( CM MK Stalin ) అమెరికా పర్యటనలో ఉన్నారు.అమెరికా పర్యటనలో భాగంగా ఎంకే స్టాలిన్‌ షికాగో సరసు( Chicago Lake ) తీరాన సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

 Video Of Stalin's Bicycle Ride In America Goes Viral, Cm, Mk Stalin, Enjoys, Cyc-TeluguStop.com

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది కాస్త వైరల్ గా చక్కర్లు కొట్టింది.ఇక ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వెంటనే స్పందిస్తూ.” చెన్నైలో మనం ఇద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం “అంటూ ట్వీట్ చేశాడు.ఈ ట్విట్ చూసిన సీఎం ఎంకే స్టాలిన్‌ ‘డియర్‌ బ్రదర్‌.మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్‌ తొక్కుతూ చెన్నై నగరాన్ని చుట్టేద్దాం.దీంతోపాటు మీకోసం మిఠాయిలు కూడా వేచిచూస్తున్నాయి.

సైక్లింగ్‌ తర్వాత మా ఇంట్లో దక్షిణాది వంటకాన్ని ఆస్వాదించి.స్వీట్ల రుచి చూద్దాం’’ అంటూ స్టాలిన్ రాసుకోచ్చారు.ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్‌ అమెరికా పర్యటన చేస్తున్నట్లు సమాచారం.అమెరికాలో సైకిల్ తొక్కుతున్న వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘సాయంత్రం శాంతి కొత్త కలలకు వేదికను సిద్ధం చేస్తుంది’ అని రాశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది.

ఇందులో చెన్నైలోని రూ.200 కోట్లతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను( Research and Development and Engineering Centre ) విస్తరించడంతోపాటు పవర్ మేనేజ్మెంట్‌కు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఉన్నాయి.రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యం.

అమెరికా చేరుకున్న సీఎం స్టాలిన్ పలు పెద్ద కంపెనీల కార్యాలయాలను కూడా సందర్శించారు.ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కార్యాలయాలను సందర్శించారు.

ఈ కంపెనీలన్నింటితో రాష్ట్రంలో పెట్టుబడుల సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube