ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు టీవీ చూడడం, ఫోన్లో సినిమాలు చూడడం, ఎక్కువసేపు లాప్టాప్ ముందు లేదా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు.ఇటువంటివన్నీ కూడా స్క్రీన్ టైం ( Screen Time ) కిందికి వస్తాయి.
కోవిడ్ మహమ్మారి వచ్చాక స్క్రీన్ సమయం చాలా పెరిగిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఉద్యోగులు ఎక్కువ కాలం పాటు స్క్రీన్ ముందు గడుపుతున్నారు.
ఆ తర్వాత ఫోన్ ( Mobile Phone ) అధికంగా ఉపయోగిస్తున్నారు.వారికి తెలియకుండానే రోజులో ఎక్కువ సమయం స్క్రీన్ ను చూస్తూనే జీవిస్తున్నారు.
ఇది మానసిక ఆరోగ్యం పై, శరీరక ఆరోగ్యం పై, హార్మోన్ల పైన ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.హార్మోన్ల అసమతుల్యత( Harmonal Imbalance ) ఏర్పడడానికి ఇది కారణమవుతుంది.
మెలటోనిన్ మన శరీరానికి అత్యవసరమైన హార్మోన్.దీని ఉత్పత్తి తగ్గితే నిద్ర రుగ్మతలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి దీని ఉత్పత్తిని నిరోధించే పనులను మానుకోడమే మంచిది.
స్క్రీన్ టైం పెరగడం వల్ల దిని ఉత్పత్తిపై కూడా చెడు ప్రభావం పడుతుంది.
ఇలా జరిగితే క్యాన్సర్ ( Cancer ) వంటి తీవ్రమైన రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఆ స్క్రీన్ టైం పెరిగినప్పుడు ఆ స్క్రీన్ నుంచి వచ్చే లైట్లు మన చర్మంపై పడతాయి.ఆ లైట్లు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి.
ఇది కేంద్రం నాడి వ్యవస్థ పై పదేపదే ఒత్తిడికి కారణం అవుతుంది.దీని ఫలితంగా కోపం పెరగడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, దూకుడుగా మారడం ఇతరుల పై ప్రేమ, దయా, జాలి వంటివి తగ్గడం జరుగుతుంది.
అధిక స్క్రీన్ సమయం నిద్ర సామర్ధ్యాన్ని మాత్రమే కాకుండా ఆకలిని కూడా నిరోధిస్తుంది.
ఆకలి పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.లెప్టిన్, గ్రాలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది.దీనివల్ల ఆకలి వేయడం లేదా అతిగా ఆకలి వేయడం వంటివి జరుగుతాయి.
బరువు అమాంతంగా పెరగడం లేదా చాలా తగ్గిపోవడం జరుగుతుంది.కాబట్టి ఈ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఉద్యోగ పరంగా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం కష్టమే కానీ ఫోన్ వాడకాన్ని తగ్గించినా చాలు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.