సాధారణంగా అధిక బరువు సమస్యతో బాధ పడే వారు.వెయిట్ లాస్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
గంటలు తరబడి ఎక్సర్సైజ్లు, డైటింగ్లు, ఫాస్టింగ్లు ఇలా ఎన్నో చేస్తుంటారు.కానీ, కొందరు ఎన్ని చేసినా బరువు తగ్గనే తగ్గరు.
అలా తగ్గడం లేదూ అంటే.మనం చేసే కొన్ని తప్పులే అందుకు కారణాలు అవుతుంటాయి.
ముఖ్యంగా రాత్రుళ్లు చాలా మంది తెలిసో, తెలియకో పలు మిస్టేక్స్ చేస్తుంటారు.అయితే అవే బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి.మరి ఆ మిస్టేక్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

ఈ మధ్య కాలంలో చాలా మందికి లేట్ నైట్ డిన్నర్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది.కానీ, ఇలా చేయడం వల్ల.తిన్న వెంటనే నిద్ర పోతారు.
దాంతో శరీరంలో కొవ్వు పెరుకుపోతూ ఉంటుంది.ఇక బరువు తగ్గడానికి ఎన్ని చేసినా ఫలితం ఉండదు.
అందుకే రాత్రి 7 గంటలకు ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలి.మరియు డిన్నర్ చేసిన ముడు, నాలుగు గంటల తర్వాత నిద్ర పోవాలి.
రాత్రుళ్లు భోజనం చేసిన తర్వాత చాలా మంది ఐస్ క్రీమ్ తింటుంటారు.అయితే బరువు తగ్గకపోవడానికి ఇదీ ఒక కారణమే.రాత్రుళ్లు భోజనం చేసిన ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు వంటివి తీసుకుంటే బరువు పెరుగుతారే తప్ప.తగ్గరు.
అలాగే రాత్రి వేళ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వంటివే కాదు.ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఫుడ్‌ను కూడా ఎవైడ్ చేయాలి.
ఎందుకంటే, ఇవి తీసుకున్నా వెయిట్ లాస్ అవ్వరు.

నేటి టెక్నాలజీ కాలంలో చాలా మంది నిద్ర సమయాన్ని టీవీలతో, స్మార్ట్ ఫోన్లతో వేస్ట్ చేసేస్తున్నారు.అయితే ఎంత కఠినమైన డైట్ ఫాలో అయినా, రెగ్యులర్‌గా వర్కౌట్లు చేసినా.శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే మాత్రం బరువు అస్సలు తగ్గరు.
కాబట్టి, ఇకపై రాత్రుళ్లు కంటి నిండి నిద్రపోండి.
ఇక కొందరికి నిద్రపోయే ముందు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.
అయితే ఈ అలవాటు వల్ల నిద్ర పట్టకపోవడమే కాదు.బరువుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
సో.రాత్రుళ్లు టీ, కాఫీలకు దూరంగా ఉండండి.కావాలీ అనుకుంటే గ్రీన్ టీ ను తీసుకోవచ్చు.