అమెరికా( America )లోని జార్జియా( Georgia )లో ఉన్న ఓ స్కూల్‌లో 14 ఏళ్ల విద్యార్ధి ఉన్మాదిగా మారి తుపాకీతో తోటి విద్యార్ధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.సెప్టెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోగా.
మరో 9 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తుపాకీ హింస మన కమ్యూనిటీలను ఎలా చీల్చివేస్తుందనడానికి ఈ ఘటన మరో నిదర్శనమని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.దేశవ్యాప్తంగా విద్యార్ధులు చదవడం, రాయడంతో పాటు తమను తాము రక్షించుకోవడం కూడా నేర్చుకోవాల్సి ఉందన్నారు.
ఫెడరల్, స్టేట్, స్టానిక అధికారులతో ఈ ఘటనపై సమన్వయం చేసుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు.అనుమానితుడిని అదుపులోకి తీసుకుని , ప్రాణనష్టాన్ని నివారించిన భద్రతా సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలో తుపాకీ హింసను అంతం చేయడాన్ని తాను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అధ్యక్షుడు వెల్లడించారు.అందుకే బైపార్టిసన్ సేఫర్ కమ్యూనిటీస్ యాక్ట్‌పై సంతకం చేసినట్లు జో బైడెన్ పేర్కొన్నారు.ఈ చట్టాన్ని గడిచిన దశాబ్ధాలలో అత్యంత అర్ధవంతమైన గన్ సేఫ్టీ బిల్‌గా ఆయన అభివర్ణించారు.తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డజన్లకొద్ది గన్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్‌ను ప్రకటించినట్లుగా వెల్లడించారు.
మరోవైపు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ ( Kamala Harris )సైతం జార్జియాలో కాల్పుల ఘటనను ఖండించారు.ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.జార్జియాలోని హైస్కూల్‌లో తుపాకీ హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి హారిస్ సంతాపం ప్రకటించారు.ఈ ఘటనలో హుటాహుటిన స్పందించిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కమలా హారిస్ కృతజ్ఞతలు తెలిపారు.
మనదేశంలో తుపాకీ హింస అనే అంటువ్యాధిని అంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.