సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పాపులర్ అయ్యారు.అయితే వీరిలో కొంతమంది అసలు పేర్లు వేరు ఉంటాయి.
సినిమాల కోసం వారు తమ పేర్లను మార్చుకొని ఆ పేర్లతోనే పాపులర్ అయ్యారు.వారి అసలు పేర్లు తెలిస్తే చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది.
పాపులర్ అయిన పేర్లే వారికి బాగా సూట్ అయ్యాయని అనిపిస్తుంది.అలాంటి సినీ సెలబ్రిటీల అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం.
మనో
పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ మనో అసలు పేరు నాగూర్ సాహెబ్.ఈ పేరు వినగానే భలే అనిపించింది కదా, ఆయన అసలు పేరు ఇదే.మనో ఒక్క ప్లేబ్యాక్ సింగర్‌గా మాత్రమే కాకుండా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, నటుడు, మ్యూజిక్ కంపోజర్‌గా కూడా పనిచేశాడు.ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు కమెడియన్ అలీకి దగ్గరి బంధువు అవడం మరో విశేషం.
మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.సినిమాల్లోకి వచ్చాక దాసరి నారాయణరావు ఆ పేరు పెట్టారు.మోహన్ బాబు తిరుపతి సమీపంలోని మోదుగులపాలెం గ్రామంలో మంచు నారాయణస్వామి నాయుడు, మంచు లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.
కమల్ హాసన్
ఈ లోక నాయకుడి అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్.కమల్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు.అతని తండ్రి D.శ్రీనివాసన్ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు.తల్లి రాజలక్ష్మి హౌస్ వైఫ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ.త్రివిక్రమ్ భీమవరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
కృష్ణవంశీ
గులాబీ, సింధూరం, మురారి వంటి సినిమాలు తీసి పాపులర్ అయిన డైరెక్టర్ కృష్ణవంశీ పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు.
జగపతిబాబు
జగ్గు బాయ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జగపతిబాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి.ఈ యాక్టర్ మచిలీపట్నంలో నిర్మాత-దర్శకుడు V.B.రాజేంద్ర ప్రసాద్‌కు జన్మించాడు.జగపతిబాబు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
యాక్టర్ జీవా
ఈ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రియల్ నేమ్ కొచ్చర్ల దయారత్నం.కె.బాలచందర్ ఈ నటుడి పేరును జీవాగా మార్చాడు, పేరు మార్చుకోవడంతో అతని తలరాత కూడా మారిపోయింది.ఈ పేరు పెట్టుకున్నాక అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.అదంతా బాలచందర్ పుణ్యమే అని ఇతను తన కుమారుడికి కె.బాలచందర్ అని పేరు పెట్టాడు.
రానా
రానా అసలు పేరు రామానాయుడు.