టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) మనస్సు మంచి మనస్సు అని అందరూ భావిస్తారు.ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలకు వరద సాయం( Flood Donation ) కింద ప్రభాస్ ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సాయంలో కూడా బాహుబలి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదని ప్రభాస్ కాబట్టి అంత భారీ స్థాయిలో సహాయం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అటు ఏపీకి( AP ) ఇటు తెలంగాణకు( Telangana ) చెరో కోటి రూపాయల చొప్పున ప్రభాస్ సాయం చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ను ప్రకటించిన హీరో ప్రభాస్ మాత్రమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు నారా భువనేశ్వరి సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం కొసమెరుపు.స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) సైతం తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచారు.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు శరవేగంగా స్పందిస్తూ తమ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అని ప్రూవ్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటిస్తారంటూ వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ రేంజ్ మరింత పెరగాలని ప్రభాస్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.