విరాళం ప్రకటించి వాళ్ల నోర్లు మూయించిన అల్లు అర్జున్.. ఎంత ప్రకటించారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలామంది స్టార్ హీరోలు విరాళం ప్రకటించగా బన్నీ విరాళం ప్రకటించలేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

 Allu Arjun Donated 1 Crore Rupees Details, Allu Arjun, Icon Star Allu Arjun,allu-TeluguStop.com

మరి కొందరు ఏకంగా పిసినారి పుష్ప అంటూ బన్నీపై ట్రోల్స్ చేశారు.అయితే ఎట్టకేలకు ఆ విమర్శలకు చెక్ పెట్టడం ద్వారా బన్నీ వార్తల్లో నిలిచారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Aptelangana, Icon Allu Arjun, Pushpa, Pushpa

తాజాగా అల్లు అర్జున్ విరాళంగా( Allu Arjun Donation ) కోటి రూపాయలు ప్రకటించి వార్తల్లో నిలిచారు.అల్లు అర్జున్ స్పందించడం లేట్ కావచ్చు కానీ స్పందించడం మాత్రం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున బన్నీ విరాళం ప్రకటించడంపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.బన్నీ మంచి మనస్సును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Aptelangana, Icon Allu Arjun, Pushpa, Pushpa

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఏకంగా 700 కోట్ల రూపాయల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ మూవీపై ఇతర భాషల్లో సైతం అంచనాలు పెరుగుతుండటం కొసమెరుపు.

పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల కానుంది.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.రష్మికకు ఈ సినిమాతో మరో భారీ హిట్ దక్కనుందని అభిమానులు ఫీలవుతున్నారు.పుష్ప2 మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 120 నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ లో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube