రేవంత్ ను మెచ్చుకున్న పవన్ .. ఆ నిర్ణయంపై ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రశంసల వర్షం కురిపించారు.జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).

 Pawan Praised Revanth For His Decision, Pawan Kalyan, Janasena, Bjp, Ap Deputy C-TeluguStop.com

బిజెపి కూటమిలో ఉన్న జనసేన,  కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశం అయినా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పవన్ కు బాగా నచ్చడంతోనే పార్టీల విషయాన్ని పక్కన పెట్టి మరి ఆయనను మెచ్చుకున్నారు.ముఖ్యంగా తెలంగాణలో హైడ్రా ( Hydra )పేరుతో చేపట్టిన చర్యలు మంచివేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని పవన్ అన్నారు .  అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ హైడ్రా అంశంపై అనేక వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap Deputy Cm, Ap Floods, Hydra, Janasena, Pawan Kalyan, Pawan Revanth, Te

భవనాలు నిర్మించిన అనంతరం కూ లగోట్టడం ద్వారా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.  నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి.పేదల నిర్మాణాలు కూల్చే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి.  ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు రూల్స్ ఖరారు చేసినా వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే నదులు,  చెరువులు కాలువలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలి.

అధికారులు అనుమతి ఇచ్చే సమయంలో అన్ని పరిశీలించిన తరువాతే పర్మిషన్ ఇవ్వాలి.స్థానిక నేతలు ఆక్రమణలను ప్రోత్సహించకూడదు.మరో 10,  15 ఏళ్లకు మరో ప్రభుత్వం వచ్చినా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ” అని పవన్ వ్యాఖ్యానించారు.

Telugu Ap Deputy Cm, Ap Floods, Hydra, Janasena, Pawan Kalyan, Pawan Revanth, Te

హైడ్రా పై షర్మిల( Sharmila ) ఏమన్నారంటే.తెలంగాణలో హైదరాబాద్ ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

  బుడమేరు రక్షణకు వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని , దీనికోసం హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు విజయవాడ వరదలకు బుడమేరే కారణం.వరద నీరు కొల్లేరులోకి వెళ్లేలా  చర్యలు చేపట్టాలి.

ఈ బాధ్యత సీఎం చంద్రబాబు మీదే ఉంది .ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదు.వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా దీనిని ప్రకటించాలి.నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలి అని షర్మిల డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube