ట్రంప్ వర్సెస్ కమలా హారిస్.. ఎవరు గెలిస్తే అమెరికాకు మంచిదంటే, గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ), రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు ( Donald Trump )ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు.

 Kamala Harris' Victory Best For Us Economy Rather Than Trump's Goldman Sachs , K-TeluguStop.com

కమలా హారిస్‌ను గెలిపించేందుకు గాను భారతీయ కమ్యూనిటీ బాటిల్ స్టేట్స్‌లో స్పెషల్ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కమలా హారిస్ విజయం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు సానుకూల పరిణామంగా ఆర్ధిక సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ పేర్కొంది.

తాను అధ్యక్షుడిగా గెలిస్తే.ఇమ్మిగ్రేషన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని, చైనా ( China )వంటి దేశాల నుంచే వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ చేసిన హామీల కారణంగా అమెరికా ఆర్ధిక వృద్ధి తగ్గుతుందని గోల్డ్‌మన్ సాచ్స్( Goldman Sachs ) అంచనా వేస్తోంది.

డెమొక్రాట్లు కనుక గెలిస్తే.కొత్త ఖర్చులు, మధ్య ఆదాయపన్ను క్రెడిట్‌లు, ఆధిక కార్పోరేట్ పన్ను రేట్ల కారణంగా స్థూల దేశీయోత్పత్తి స్వల్పంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది.

Telugu China, Donald Trumps, Goldman Sachs, Kamala Harris, Kamalaharris-Telugu N

చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను పునరుద్ధరించడం, నవజాత పిల్లల నుంచి తక్కువ , మధ్య ఆదాయ కుటుంబాలకు 6000 డాలర్ల కొత్త పన్ను క్రెడిట్‌ను ప్రవేశపెట్టడం వంటి విధానాల ద్వారా శ్రామిక కుటుంబాలకు మద్ధతు ఇవ్వడం హారిస్ ఆర్ధిక ప్రణాళిక లక్ష్యం.ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, కిరాణా సామాగ్రి ఖర్చులను తగ్గిస్తానని కమలా హారిస్ ప్రతిజ్ఞ చేశారు.హారిస్ అధ్యక్షురాలిగా గెలిస్తే ట్రంప్ ప్రెసిడెన్సీ కంటే నెలకు 10 వేల ఉద్యోగాలు పెరుగుతాయని, పూర్తి రిపబ్లికన్ టేకోవర్ కంటే 30 వేల ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని గోల్డ్‌మన్ అంచనా వేసింది.

Telugu China, Donald Trumps, Goldman Sachs, Kamala Harris, Kamalaharris-Telugu N

హారిస్ నాయకత్వంలో శ్రామిక శక్తికి ఇమ్మిగ్రేషన్ దోహదపడుతుందని అభిప్రాయపడింది.ట్రంప్ ప్రతిపాదించిన ఆర్ధిక విధానాలు రాబోయే దశాబ్ధంలో ఫెడరల్ లోటును 5.8 ట్రిలియన్ డాలర్లకు పెంచుతాయని అంచనా వేసింది.ఇది హారిస్ ప్రతిపాదనల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ అధ్యయనం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube