వరదల్లో బురద రాజకీయం ఎందుకు  ? 

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  ముఖ్యంగా ఏపీలోని ప్రధాన నగరంగా ఉన్న విజయవాడ( Vijayawada ) ఈ వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయింది.

 Cm Chandrababu Naidu Criticizes Ycp Over Vijayawada Floods Details, Tdp, Chandra-TeluguStop.com

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ అధికారులు , స్వచ్ఛంద సంస్థలు,  రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి .ఇక టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సైతం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ముంపు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయ విమర్శలు చర్చనీయాంశం గా మారాయి.

ముఖ్యంగా రెండు రోజులుగా కొంతమంది అధికారులను, గత వైసిపి( YCP ) ప్రభుత్వం ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు  ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి.  ఐదేళ్ల నుంచి ఏపీలో వ్యవస్థలు పని చేయడం మానేశాయని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

దీంతో గత ఐదేళ్ల లో సంస్థలు పనిచేయకపోతే పాలన ఎలా జరిగింది ? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు య్యాయి ?  అధికారులు ఖాళీగానే కూర్చున్నారా అనే ప్రశ్నలు ఎన్నో జనాల నుంచి వస్తున్నాయి.అయితే ఆ ఐదేళ్లు  ఏ విధంగా నడిచిందనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా చెప్పుకుంటే కరోనా సమయంలో ప్రజలకు అందిన సేవలు వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cm Chandrababu, Corona, Criticizes Ycp, F

రెండేళ్ల పాటు కరోనా ( Corona ) ప్రభావం ఉంది.ఆ వైరస్ మహమ్మారినపడి ఎంతోమంది మరణించారు.  ఆ సమయంలో అధికారులు , ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అనేకమంది ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు.

కరోనా సమయంలో ఇదే అధికారులు పనిచేశారు.తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించారు.

అలా అధికారులు పనిచేయబట్టే ఏపీలో కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య బాగా తగ్గింది.ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకపోయినా వారికి అన్ని రకాల సదుపాయాలు అందించే కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు.

  ముఖ్యంగా పోలీసులు,  వాలంటీర్లు ఇతర ప్రభుత్వ అధికారులు చేసిన సేవలను కొంతమంది సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు.ఆ విషయాలన్నీ మరిచిపోయి చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్న అధికారులు ఇప్పుడు పనిచేయడం లేదు అని చేస్తున్న విమర్శలను సోషల్ మీడియా వేదికగా తప్పుపడుతున్నారు.

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cm Chandrababu, Corona, Criticizes Ycp, F

ముఖ్యంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అనుకూలంగా వ్యవహరించిన అధికారులు ను టార్గెట్ చేసుకుని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.ఇప్పుడు అదే అధికారులు సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.అయితే వారు పనిచేస్తున్న చోట సహాయక చర్యలు సక్రమంగా అందడం లేదని పరోక్షంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు తప్ప అసలు అక్కడు వాస్తవ పరిస్థితి ఏమిటి? ఎందుకు సహాయక చర్యలు సక్రమంగా అందడం లేదు అనే విషయాన్ని బాబు పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఉద్యోగ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube