సోగ్గాడు సినిమాలో ఉదయ్ కిరణ్ నటించాల్సింది.. కానీ రవిబాబు ఈగో కి ఎందుకు పోయాడు ?

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో సూపర్ హిట్స్ సాధించి “హ్యాట్రిక్ హీరో” అయిపోయాడు ఉదయ్ కిరణ్( Uday Kiran ).చాలామంది స్టార్ డైరెక్టర్లతో ఈ హీరో కలిసి పని చేశాడు.

 Ravi Babu About Soggade Movie , Uday Kiran , Ravi Babu , Neeku Nenu Naaku Nuvvu-TeluguStop.com

క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు కూడా ఈ లవర్ బాయ్‌ని హీరోగా పెట్టి “నీకు నేను నాకు నువ్వు” సినిమా తీశాడు అది సరిగ్గా ఆడలేదు, అది వేరే విషయం.నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సూపర్ హిట్ సినిమా రావాల్సి ఉంది.

కానీ ఉదయ్ కిరణ్ రవిబాబును బాగా ఇబ్బంది పెట్టాడు.ఒకసారి నటిస్తానని, ఇంకోసారి నటించను అంటూ అతను దర్శకనిర్మాతలను ఒక ఆట ఆడుకున్నాడు.

దీంతో రవిబాబుకు చిర్రెత్తుకొచ్చింది.ఆ సినిమా మరేదో కాదు (2005)లో వచ్చిన రొమాంటిక్ మూవీ సోగ్గాడు.

ఇందులో ఉదయ్ కిరణ్ నటించినట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.అతని నటిస్తానని చెబుతూ ఈ సినిమాలో నటించలేదు.

అందువల్ల ముందుగా రాసుకున్న కథంతా కూడా యూజ్‌లెస్‌గా మారింది.ఫలితంగా మూవీ జస్ట్ యావరేజ్ గా నిలిచింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ నిర్మించిన ఈ సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఉదయ్ కిరణ్ గురించి రవిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Telugu Aarthi Agarwal, Neekunenu, Ravi Babu, Soggadu, Suresh Babu, Uday Kiran-Mo

రవిబాబు ( Ravi babu )మాట్లాడుతూ “ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్, తరుణ్ ముగ్గురిని ప్రధాన పాత్రల్లో నటింపజేయాలని చూశాం.ఎందుకంటే అప్పట్లో వారు లీడింగ్ స్టార్స్.పార్టీ తరుణ్ ( Tarun )ఇద్దరూ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఉదయ్ కిరణ్ ముందుగా చేస్తాను అన్నాడు.

తర్వాత చెయ్యను అని అన్నాడు.నన్ను ఒక డైలమాలో పడేశారు.చివరికి చెన్నైలో కలిసి ఆ సినిమా చేస్తానని చెప్పాడు దాంతో నేను సురేష్ బాబుకి ఫోన్ చేసి అదే విషయాన్ని తెలియజేశాను.‘సార్ ఉదయ్‌ కిరణ్ సినిమా చేస్తానన్నాడు మిమ్మల్ని ఉదయం ఎనిమిదింటికి కలుస్తానని కూడా చెప్పాడు’ అని ఫోన్ కాల్ ద్వారా చెప్పాను.ఉదయ్ చెప్పినట్లే ఎనిమిదింటికి సురేష్ బాబు వద్దకు వచ్చాడు.నేను కూడా అక్కడే ఉన్నాను.”

Telugu Aarthi Agarwal, Neekunenu, Ravi Babu, Soggadu, Suresh Babu, Uday Kiran-Mo

“అప్పుడు ఉదయ్ ‘నేను ఈ సినిమా చెయ్యను, సార్.’ అని చల్లగా చావు కబురు చెప్పాడు.దాంతో నేనూ, సురేష్ బాబూ షాక్ అయ్యాం.కథ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటయ్యా అంటూ సురేష్ బాబు అతన్ని ప్రశ్నించారు.అప్పుడే తల పొగరుతో నేనొక నిర్ణయం తీసుకున్నా.బాగా ఎమోషనల్ అయిపోయి నువ్వు చేయకపోతే ఏంటి నేను వేరే యాక్టర్ ని పెట్టి సినిమా తీసుకుంటా అనే పొగరుతో నేను డెసిషన్ తీసుకున్నా.నటుడు జుగల్ హన్సరాజ్ ను ఉదయ్ కిరణ్ ప్లేసులో తీసుకున్నా.” అని చెప్పాడు.”ఉదయ్ కిరణ్, తరుణ్ ఇద్దరూ ఒకే స్టార్‌డమ్‌ కలిగి ఉన్నారు.వారిద్దరి మధ్య ఒక హీరోయిన్, వారి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెడితే బాగుంటుందని చూశాను.

కానీ ఉదయ్ కిరణ్ ఒప్పుకోలేదు.అందువల్ల వేరే నటుడిని తెచ్చి పెట్టాను.

దీనివల్ల క్యారెక్టరైజేషన్ అన్‌బాలెన్స్ అయ్యింది.ముగ్గురు మధ్య లవ్ స్టోరీ పెట్టాను.

కానీ ఆ అమ్మాయి ఎలాగైనా తరుణ్ వెళ్ళిపోతుంది, అతన్నే ప్రేమిస్తుందనే ఒక ప్రేడిక్టబిలిటీ ప్రేక్షకులకు కలిగింది.ఉదయ్ కిరణ్ క్యారెక్టర్ నేను చాలా చక్కగా రాసుకున్నాను.

క్లైమాక్స్ లో తరుణ్ వద్దకి ఆర్తి అగర్వాల్ వస్తుంది.అప్పుడు తరుణ్ ‘నేను ఏదో నీకు సహాయం చేశాను.

మధ్యలో వచ్చానని అది లవ్ అయిపోదు.నిన్ను మొదటిగా ప్రేమించింది ఉదయ్ కిరణ్.

అతనిదే నిజమైన లవ్వు’ అని చెప్పిద్దామని చూశాను.అలాగే ఉదయ్ కిరణ్ చేత ‘లేదు నీకు అతను బాగా సహాయం చేశాడు.

అందువల్ల అతన్నే నువ్వు ప్రేమించాలి’ అని చేపిద్దాం అనుకున్నాను.ఇద్దరూ కాదన్నప్పుడు ఆమె రైల్వే ట్రాకుల మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడు ఒక గులాబీ పువ్వు ఆమె ముందుకు వస్తుంది.అదే సినిమా లాస్ట్ షాటు.

ఇలా ఇంట్రెస్టింగ్గా సినిమా తీద్దాం అనుకున్నా కానీ మూవీ స్పాయిల్ అయిపోయింది’ అని రవిబాబు చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube