తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ( Telugu Biggest Reality Show )బిగ్‌బాస్‌పై ఎప్పుడూ తీవ్రమైన విమర్శలు వస్తూనే ఉంటాయి.అదొక చెత్త షో, దాన్ని చూస్తే ప్రజలు చెడిపోతారు అని కూడా కొందరు తీవ్రంగా కామెంట్లు చేస్తుంటారు.
నిజం చెప్పాలంటే ఈ షో ద్వారా డబ్బులు సంపాదించాలనేదే స్టార్ మా యాజమాన్యం కోరిక.ఎవరినో ఉద్ధరించాలని వారు ఈ షో చేస్తున్నారని అనుకుంటే పొరపాటే.
నిజానికి ఆ విషయం అందరికీ తెలిసిందే.రీసెంట్‌గానే సీజన్ 8 ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజానికి బిగ్‌బాస్ అనేది ఒక గేమ్.
ఇందులో గెలవాలంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాకుండా బుద్ధిబలం కూడా అవసరమవుతుంది.ఒక కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు, వారి బలహీనతలు, బలాలు ఏంటి? వారిని అధిగమించి ఎలా మొదటి స్థానంలో నిలవాలి, ఎలా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవాలి ఇటువంటివన్నీ కూడా కంటెస్టెంట్స్ ఆలోచించాలి.కొన్నిసార్లు ఎంత కష్టపడినా విజేత అయ్యే అవకాశం ఉండదు.దీనికి లక్ ఉండాలి.సో ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.
చాలామంది లోపలికి వెళ్లే ముందు బయట తమకంటూ కొన్ని ఓట్లు పడేలాగా ఏర్పాటు చేసుకుంటారు.ఎలిమినేషన్స్ నుంచి బయటపడడానికి వారు అలా ప్లాన్ చేసుకుంటారు.తమను ప్రమోట్ చేసే వారిని కూడా నియమించుకుంటారు.
సోషల్ మీడియాలో నెటిజన్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఓట్లు ఎక్కువ పడేలాగా చేసుకుంటారు.అయితే ఈసారి సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరీని పూర్తిగా తీసేశారు.
ఈసారి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, టీవీ నటులను ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు.ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వారిని తీసుకొని ఉండవచ్చు కానీ శేఖర్ బాషా ( Shekar Basha )ఒక్కరే ఇప్పుడు హౌజులో కాస్త కామెడీ పండిస్తున్నాడు.
మిగతా వారందరూ చాలా బోరింగ్ ఆట ఆడుతున్నారు.
తొలి సీజన్లలో మీడియా జర్నలిస్టులు, సింగర్లను, యాంకర్లను, కొరియోగ్రాఫర్లను, దర్శకులను, సినిమా నటులు, హేతువాదుల్ని హౌజ్‌లోకి తీసుకువచ్చేవారు.ఇలా విభిన్న రంగాల నుంచి తీసుకొచ్చిన వారు ఉండటం వల్ల షో ఆటలు రక్తికట్టేవి.కానీ ఇప్పుడు ఒకే రంగానికి చెందిన వారందరినీ తీసుకొచ్చి హౌస్‌లో పడేశారు.
ఇంతకుముందే సీజన్లలో నాన్-తెలుగు కంటెస్టెంట్లను కూడా తీసుకునేవారు.వారిని తెలుగు మాట్లాడమని బలవంతం చేసేవారు కానీ ఇప్పుడు తెలుగు వచ్చిన వారినే తీసుకున్నారు.
కానీ వారు 70% ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు.ఈసారి తెలుగు రాని వాళ్ళు ఎవరూ లేరు కానీ తెలుగు తెలిసిన వాళ్లందరూ ఇంగ్లీషులో లేదంటే హిందీలో మాట్లాడుతూ ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నారు.
ముఖ్యంగా ఈ భాషలో అర్థం కాని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి కెప్టెన్ లేడు, రేషన్ సంపాదించుకోవాలి వంటి కొత్త రూల్స్ తీసుకొచ్చారు కానీ అవన్నీ చాలా చిన్నవి.
బేసిక్ షో అనేది మారదు.టాస్కులు, ఎలిమినేషన్లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టేసి షో ఎంటర్‌టైనింగ్ మార్చడమే బిగ్‌బాస్ యాజమాన్యం లక్ష్యం.
అయితే ఈసారి నిఖిల్ సోనియా టఫ్ కేండిడేట్స్‌గా కనిపిస్తున్నారు.మిగతా వాళ్ళందరూ అంత స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు.