గత కొద్దిరోజులుగా మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది అంటూ వార్తలు వచ్చాయి.ఎప్పుడైతే అల్లు అర్జున్( Allu Arjun ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి కాకుండా తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారో అప్పటి నుంచి అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ పరోక్షంగా టార్గెట్ చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే నాగబాబు, సాయిధరమ్ తేజ్ వంటి వారు పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు సంచలనంగా మారాయి.ఇక పవన్ కళ్యాణ్ కూడా అడవుల సంరక్షణ విషయంలో పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) గురించి మాట్లాడారని అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అల్లు అర్జున్ సైతం ఒక సినిమా వేడుకలో నాకు ఇష్టమైతే నేను వెళ్తాను నా మనసుకు నచ్చితేనే వారికోసం వస్తాను అంటూ మాట్లాడటంతో మరోసారి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది.దీంతో కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ కు మీడియా వేదికగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎలా ఆడుతుందో చూస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇలా వీరిద్దరి మధ్య ఇలాగే వివాదం కొనసాగుతుందని అందరూ భావించారు.కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) సందర్భంగా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇలా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈయన రిప్లై ఇస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి సైతం రిప్లై ఇచ్చారు.
అల్లు అర్జున్ చేసిన పోస్టుకు పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ థాంక్యూ అంటూ కామెంట్ చేశారు.దీంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలకు ఇంతటితో పులిస్టాప్ పెడితే బాగుంటుందని అభిమానులు కూడా ఇక ఈ విషయం గురించి మర్చిపోవాలి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.