ఇటీవల తెలుగులో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )గొడవలు కొట్లాటలతో రసవతరంగా సాగుతోంది.బిగ్ బాస్ షో మొదలైన రెండో రోజు నుంచి హౌస్ లో కొట్లాటలు మొదలయ్యాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా హీట్ గా సాగాయి.నామినేషన్ అని పేరు ఎత్తగానే గొడవలు, గోలలు, అరుపులు, ఏడుపులు నానా రచ్చ ఉంటుంది.
నిన్నటి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది.చీఫ్‌లు ముగ్గురి మెడలో ఒక పూసల దండ వేయించి ఆ ముగ్గురిన్సి సపరేట్ గా కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు బిగ్ బాస్.
ఆ తర్వాత మిగిలిన వారు నామినేషన్స్ మొదలు బెట్టారు.సోనియా( Sonia )తోనే నామినేషన్స్ మొదలు పెట్టారు.
ఈ అమ్మడు ఒక రేంజ్ లో వాయించింది.సోనియా ముందుగా బేబక్క ని నామినేట్ చేసింది.
కిచన్ లో ఆమె అంతగా రెస్పాన్స్ బుల్ గా ఉండటం లేదు అని సోనియా తెలిపింది. కుక్కర్ వాడటం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని ఆకలితో ఉంచుతారా? అంటూ సోనియా బేబక్కను నామినేట్ చేసింది.కిచన్ హ్యాండిలింగ్ మీద గట్టిగానే మాట్లాడింది సోనియా.బేబక్కకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.ఈ లోగా మధ్యలో వచ్చిన చీఫ్ లకు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది.ఇది నా గేమ్ నా నామినేషన్.
చీఫ్స్ ఏం జడ్జీలు కాదు నన్ను మాట్లాడనివ్వండి అంటూ ఇచ్చిపడేసింది సోనియా.ఆ తర్వాత ప్రేరణ( Prerana )ను నామినేట్ చేసింది.
నువ్వు ఇది ఒక పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తున్నావ్.ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్లి ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగ్ లు వేస్తున్నావ్ ఇది కరెక్ట్ కాదు అంటూ నామినేట్ చేసింది.దాంతో ప్రేరణ డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేసిన సోనియా ఛాన్స్ ఇవ్వలేదు.ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠ( Naga Manikanta )ను నామినేట్ చేశాడు.ఎవరితోనూ మాట్లాడడు.ఒంటరిగా ఉంటాడు కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటాడు.
మింగిల్ అవడం అంటూ నబీల్ చెప్పాడు.దానికి మణికంఠ సెంటిమెంట్ స్టోరీ మొదలుపెట్టాడు.
2015నుంచి నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.దానికి నబీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ అని చెప్పాలి.మణికంఠ స్టోరీకి నిఖిల్ బ్రేక్ వేశాడు.ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు నబీల్.వీరిలో నాగ మణికంఠను నామినేట్ చేసి.బేబక్కను సేవ్ చేసింది యష్మీ.
అయితే నామినేషన్స్ లో మణికంఠ సెంటిమెంట్ స్టోరీ చెప్పి ప్రేక్షకులను సెంటిమెంటుగా కొట్టాడని, ఈ సెంటిమెంటుతో మణికంఠకు బాగా ఓట్లు పడవచ్చు అని తెలుస్తోంది.మరి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది వీకెండ్ లో చూడాలి మరి.