చాలామంది సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయని వారికి ఎలాంటి బాధలు ఉండవని అనుకుంటూ ఉంటారు.కానీ తెరపై కనిపించినంత ఈజీగా వారి జీవితాలు ఉండవు.
కేవలం కొంతమంది మాత్రమే సంతోషంగా జీవిస్తే సామాన్య వ్యక్తులు లాగే ఇంకొందరు సెలబ్రిటీలు కూడా చాలామంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.
బయటకు చెప్పుకోలేని సమస్యలు తారలను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి.అయితే ఇవేవి తమ అభిమానులకు తెలియజేయకుండా తమ నటనతో వారిని అలరిస్తూ ఉంటారు.
తెర వెనుక ఎన్ని సమస్యలు ఉన్నా తెరపైకి రాగానే వాటన్నింటినీ మరిచిపోయి ప్రేక్షకులను చేయడానికి ప్రయత్నిస్తుంటారు.అలా బాలీవుడ్ నటి ప్రీతీ జింటా( Preity Zinta ) కూడా నిజ జీవితంలో చాలా కష్టాలు పడినా వెండితెరపై మాత్రం మహారాణిలా నవ్వుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయట.తాజాగా ఇదే విషయాన్ని ఆమె వెల్లడించింది.తాజాగా ప్రీతి జింటా తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి మాట్లాడుతూ.అందరి జీవితాల్లో లాగే నా లైఫ్‌లో కూడా మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి.నిజ జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాలా సార్లు కష్టపడ్డాను.
ముఖ్యంగా పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్( IVF cycles) తీసుకున్నప్పడు చాలా బాధను అనుభవించాను.కొన్నిసార్లు తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది.ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదాన్ని.కానీ ఆ ట్రీట్‌మెంట్ ఫెయిల్ అయింది.దీంతో చివరకు సరోగసి ద్వారా తల్లిని అయ్యాను అని ప్రీతిజింటా చెప్పుకొచ్చింది.కాగా ఈమె 2016లో అమెరికాకు చెందిన జీన్( Gene)ను ప్రీతి జింటా వివాహం చేసుకుంది.2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది.ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఈమె సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లాహోర్: 1947 సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది.రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.