టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ప్రణీత( Pranitha Subhash ) ఒకరు కాగా కొన్నేళ్ల క్రితం వరకు వరుసగా మూవీ ఆఫర్లను సొంతం చేసుకున్న ప్రణీత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే.రెండోసారి తల్లి కావడం గురించి ప్రణీత స్పందిస్తూ కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మా కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.ప్రత్యేకించి మా కూతురు అర్నా( Daughter Arna) తన తమ్ముడిని చూసి బేబి అంటూ మురిసిపోతుందని ప్రణీత పేర్కొన్నారు.
బాబు పెద్దయ్యే వరకు తనని చూసుకోవడం కోసం మరికొన్ని నిద్రలేని రాత్రులు గడపాలని ప్రణీత చెప్పుకొచ్చారు.ఇది సవాలుతో కూడినదని ఆమె పేర్కొన్నారు.
తొలిసారి గర్భిణిగా ఉన్న సమయంలో నేను అందరి సలహాలు వింటూ వారి సలహాలను పాటించానని ప్రణీత తెలిపారు.
రెండోసారి నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి కూల్ గా ఉన్నానని ప్రణీత పేర్కొన్నారు.ఒత్తిడికి గురి కాకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నేను రెస్ట్ తీసుకుంటున్నానని ఆర్నా పుట్టినప్పుడు నేను వర్క్ లో బిజీ అయ్యానని ఇప్పుడు కూడా అలాగే పనిలో బిజీ కావాలని కోరుకుంటున్నానని ప్రణీత వెల్లడించారు.
ప్రణీతకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రణీత కెరీర్ మొదలైంది.ఈ సినిమా తర్వాత ప్రణీత అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్, మరికొన్ని సినిమాలలో నటించారు.ఆమె భర్త పేరు నితిన్ రాజు కాగా ఆయన బెంగళూరులో బిజినెస్ మేన్ గా ఉన్నారు.2022 సంవత్సరం జూన్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత ఈరోజు మగబిడ్డకు జన్మనిచ్చారు.