తండ్రి కష్టాలు చూసి ఆరు మెడల్స్ సాధించిన కూతురు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒక వ్యక్తి సక్సెస్ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టపడితే మాత్రమే కోరుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.

 Success Journey And Hard Work Young Women Archieves Six Gold Medals Universit-TeluguStop.com

సక్సెస్ దక్కిన సమయంలో ఎంతో ఆనందం కలుగుతుందనే సంగతి తెలిసిందే.అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సక్సెస్ సాధించే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.

Telugu Indianinstitute, Komal Priya, Kurnool, Gold Medals, Level Delhi-Inspirati

ఎన్ని కష్టాలు ఎదురైనా చదువులో టాప్ లో ఉంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా( Kurnool )కు చెందిన కోమల్ ప్రియా( Komal Priya ) ప్రశంసలు అందుకున్నారు.డాక్టర్ కావాలని కలలు కన్న కోమల్ ప్రియా నీట్ పరీక్షలో ఆశించిన ర్యాంక్ రాకపోవడంతో బీఎస్సీ అగ్రికల్చర్ లో ఫ్రీ సీట్ సాధించి నంద్యాల జిల్లా మహానందిలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా కాలేజ్ లో చేరారు.కాలేజ్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కు ఎంపికైన కోమల్ ప్రియా యూనివర్సిటీలో చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నారు.

Telugu Indianinstitute, Komal Priya, Kurnool, Gold Medals, Level Delhi-Inspirati

ఏకంగా ఆరు గోల్డ్ మెడల్స్( Six gold medals ) ను సాధించడం ద్వారా కోమల్ ప్రియా ప్రశంసలు అందుకుంటున్నారు.ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షను రాసిన ఆమె ఆ పరీక్షలో జిల్లాలో 27వ ర్యాంక్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ లో ఆమెకు సీటు లభించడం గమనార్హం.

కీటక శాస్త్ర విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన కోమల్ ప్రియా ఆ తర్వాత పీహెచ్డీకి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రియ మాత్రం వాటిని లెక్క చేయకుండా ముందడుగులు వేశారు.

ఆమె తండ్రి చిన్న పానీపూరీ వ్యాపారం చేసి ఆమెను, ఆమె సోదరిని చదివించారు.తండ్రి కష్టాన్ని గమనించిన ప్రియ భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube