ఈ మధ్య కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వల్ల బన్నీ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
బన్నీ ఏ ఈవెంట్ లో మాట్లాడినా సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.బన్నీకి ఇకపై తమ సపోర్ట్ ఉండదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే టాలీవుడ్ నుంచి పన్ను చెల్లింపుల్లో టాప్ లో బన్నీ నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.టాప్ 20 జాబితాలో టాలీవుడ్ నుంచి బన్నీ నిలవగా బన్నీ ఏకంగా 17 కోట్ల రూపాయలు పన్ను చెల్లించడం గమనార్హం.
ఒకవైపు సినిమాలతో మరోవైపు వ్యాపారాలతో బిజీగా ఉన్న బన్నీ పన్ను చెల్లింపుల్లో టాప్ లో నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
మరోవైపు పుష్ప ది రూల్( Pushpa 2 ) నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఒక పాటను మించి మరొకటి హిట్ గా నిలిచాయి.ఈ సినిమా నుంచి త్వరలో థర్డ్ సింగిల్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ బడ్జెట్ పరంగా టాప్ మూవీ అనే సంగతి తెలిసిందే.కల్కి తర్వాత ఆ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఈ సినిమానే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ సినిమాలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది పుష్ప ది రూల్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప ది రూల్ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.