ట్రూడోకు షాకిచ్చిన భారత సంతతి నేత... ముందస్తు ఎన్నికల ముంగిట కెనడా..?

గృహ సంక్షోభం, పెరుగుతున్న వలసలు ఇతర సమస్యలతో కిందా మీద పడుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు( Prime Minister Justin Trudeau ) భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ ( Jagmeet Singh )సారథ్యంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) షాకిచ్చింది.ట్రూడో ప్రభుత్వానికి ఆ పార్టీ మద్ధతును ఉపసంహరించుకోవడంతో కెనడా ప్రభుత్వం మైనారిటీలో పడింది.

 Pm Trudeau- Ndp's Singh Power Sharing Deal Falls Apart, Early Election Likely In-TeluguStop.com

దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

షెడ్యూల్ ప్రకారం కెనడాలో ఫెడరల్ ఎన్నికలు 2025 అక్టోబర్ చివరినాటికి జరగాల్సి ఉంది.

నవంబర్ 2015లో తొలిసారిగా అధికారాన్ని అందుకున్న జస్టిన్ ట్రూడో నాటి నుంచి ఏకధాటిగా కెనడాను పాలిస్తున్నారు.అయితే ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత, అధిక ధరలు, గృహ సంక్షోభం వంటి పరిణామాలతో లిబరల్స్ ఓడిపోతారని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

Telugu Canada, Federal Canada, Jagmeet Singh, Democratic, Pmtrudeau, Primejustin

జగ్మీత్‌ షాకిచ్చిన వెంటనే ట్రూడోకు మరో దెబ్బ తగిలింది.లిబరల్స్ ఎన్నికల( Liberals election ) ప్రచారానికి సారథ్యం వహించనున్న జెరెమీ బ్రాడ్‌హర్ట్స్ తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో ప్రధానికి గట్టి షాక్ తగిలినట్లయ్యింది.తాను కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని.కానీ ట్రూడో ఈసారి గెలుస్తాడని తాను భావించడం లేదని బ్రాడ్‌హర్ట్స్ అన్నట్లుగా టొరంటో స్టార్ నివేదించింది.

Telugu Canada, Federal Canada, Jagmeet Singh, Democratic, Pmtrudeau, Primejustin

బుధవారం లిబరల్ ప్రభుత్వానికి తన మద్ధతును ఉపసంహరించుకున్న తర్వాత జగ్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు.జస్టిన్ ట్రూడోతో జరిగిన ఒప్పందాన్ని తాను రద్దు చేశానని.దీని కారణంగా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని జగ్మీత్ పేర్కొన్నారు.అయితే ట్రూడో లెఫ్ట్ సెంటర్ పార్టీ, యూనియన్ మద్ధతును పొందుతున్నారని ఆయన చెప్పారు.గత నెలలో రైల్వే ఉద్యోగులను తిరిగి పనిలోకి నెట్టడం పట్ల జగ్మీత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ప్రతిపక్ష పార్టీలు ఏకమై అవిశ్వాసానికి మద్ధతు ఇస్తేనే ట్రూడో ప్రభుత్వం కుప్పకూలుతుంది.కాబట్టి ప్రస్తుతానికి ట్రూడో ప్రభుత్వం సురక్షితంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube