తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే చిరంజీవి హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో చేయాల్సిన ఒక సినిమా మిస్ అయిన విషయం మనలో చాలా మందికి తెలియదు.
వందేమాతరం అనే టైటిల్ తో కృష్ణవంశీ చిరంజీవితో ఒక సినిమా చేయాలనుకున్నాడు.ఇక దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం ఒక మంచి కథను కూడా రెడీ చేసుకున్నాడు.
కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు.ఇక అప్పటినుంచి చాలావరకు చిరంజీవితో సినిమా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందే తప్ప సినిమా అయితే చేయలేకపోయాడు.నిజానికి కృష్ణవంశీ నాగార్జున, మహేష్ బాబు( Nagarjuna, Mahesh Babu) లాంటి హీరోలతో మంచి సినిమాలు చేసి సక్సెస్ లను అందుకున్నాడు.ఇంకా ఖడ్గం సినిమా దేశభక్తిని చాటుకునే సినిమా అయినప్పటికి దాని కంటే ఒక గొప్ప కథతో కృష్ణవంశీ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ సినిమా చేయలేకపోయాడు.కారణం ఏదైనా కూడా సినిమా చేయలేదు అనే వెలితి మాత్రం ఆయనకి ఇప్పటికీ ఉందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసాడు.
ఇక ఆ లోటు తీర్చుకోడానికి రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే( Govindudu Andarivadele )’ అనే సినిమా చేశాడు.ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇక రామ్ చరణ్ చిరంజీవితో సినిమా చేయలేదనే వెలితి కొంతవరకు తగ్గిందని తను చెబుతున్నప్పటికీ చిరంజీవితో సినిమా చేసి ఉంటే ఆయన కెరియర్ అనేది మరింత ముందుకు సాగుతూ ఉండేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.తన స్నేహితుడు అయిన గుణశేఖర్ లాంటి డైరెక్టర్ కూడా చిరంజీవితో ‘చూడాలని ఉంది’ అనే సినిమా చేసి సక్సెస్ అందుకొని స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కానీ కృష్ణవంశీ మాత్రం ఆ అదృష్టాన్ని అందుకోలేకపోయాడు…
.