శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

శ్రీ కృష్ణ పరమాత్ముడికి అష్ట భార్యలనే విషయం మన అందరికీ తెలిసిందే.కానీ కృష్ణ పరమాత్ముడికి  ఎంత మంది సంతానమనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

 Do You Know How Many Children Lord Krishna Has, Devotional, Krishna Sons, Sri Kr-TeluguStop.com

కానీ ఎనమండుగురు భార్యలు కల్గిన శ్రీ కృష్ణుడికి ఎంత మంది పిల్లలో వారి పేర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ కృష్ణ భగవానుడికి ఉన్న ఎనిమిది మంది భార్యలతోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.రుక్మిణీ దేవి వల్ల ప్రద్యుమ్నుడు, చారు దేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారు చంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. అలాగే సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పిల్లలు పుట్టారు.

జాంబవతీ వల్ల సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది.నాగ్నజితి వల్ల వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.

అలాగే కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.లక్షణనకు ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

 మిత్రవిందు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. అంతే కాకుండా భద్ర వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.

Do You Know How Many Children Lord Krishna Has, Devotional, Krishna Sons, Sri Krishnudu, Telugu Devotional - Telugu Devotional, Krishna, Sri Krishnudu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube