వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )భారత్ వేదికగా ప్రారంభం అవ్వడానికి 24 గంటల సమయం మాత్రమే ఉంది.ఈ సమయంలో ప్రపంచకప్ ఆడుతున్న స్టార్ ఆటగాళ్లతో పాటు క్రికెట్లో పనిచేస్తున్న పెద్దలకు సాధారణంగా ఎదురయ్యే ఓ అతి పెద్ద సమస్య ఉంది.
అది ఏమిటంటే.వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం స్నేహితులు, బంధువులు, ఇంకా తెలిసినవారు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు.
అయితే భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) కు కూడా బంధువులు, స్నేహితుల నుండి వరల్డ్ కప్ టికెట్ల కోసం రిక్వెస్ట్ రావడంలో పెద్దగా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు.అందుకే విరాట్ కోహ్లీ ఈ తలనొప్పులు ఎందుకని ముందుగానే ఓ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్నేహితులని, బంధువులని కోరాడు.
ఆ విషయంలో తనను రిక్వెస్ట్ చేయవద్దని కోరాడు.విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా.
వన్డే వరల్డ్ కప్ టికెట్లు కావాలని తనను సంప్రదించవద్దని బంధువులు, స్నేహితులను కోరుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తున్న అన్ని స్టేడియం లలో ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి.కాబట్టి ఈ సమయంలో తనను టికెట్ల కోసం విసిగిస్తే తన ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని భావించిన విరాట్ కోహ్లీ ముందుగానే తనను ఎవరు సంప్రదించకూడదని ఇలా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టినట్లు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇక మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్( England- New Zealand ) మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవ్వనుంది.
భారత్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.







