కొద్ది రోజుల క్రితం వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకుని వార్తల్లోకి ఎక్కారు.సొంత పార్టీకే చెందిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ను గెలిపించి తాను తప్పు చేశానని, బహిరంగంగా సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్న ఘటనను కలకలం సృష్టించింది.
గత కొంతకాలంగా ముదునూరి ప్రసాద్ రాజు కు సుబ్బారావు కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజు తనకు వ్యతిరేకంగా పని చేస్తూ, తన అనుచరులను ఇబ్బంది పెడుతున్నారని , పదవుల్లో తన వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వైసిపి అధిష్టానం కూడా మూడేళ్లుగా తనకు సరైన ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వకపోవడంపై న సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.ఈ అసంతృప్తిని బయటపెట్టేందుకు ఇప్పటివరకు ఆయనకు సరైన సందర్భం రాలేదు.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కు ప్రభుత్వం చుట్టింది.
ఈ మేరకు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి భీమవరం ను కేంద్రంగా చేయడంపై నరసాపురం లో నిరసనలు మొదలయ్యాయి.
నరసాపురం జిల్లా కేంద్రంగా చేయాలని కొద్ది రోజులుగా ప్రజా సంఘాలు దీక్షలు చేస్తున్నాయి ఈ కార్యక్రమం కు హాజరైన సుబ్బారాయుడు ప్రసాద్ రాజు పై విమర్శలు చేస్తూ, చెప్పుతో కొట్టుకున్నారు.గతంలో ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన సుబ్బారాయుడు ఆ తరువాత అనేక పార్టీలు మారారు.
టిడిపి నుంచి ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత మళ్ళీ టిడిపి , తర్వాత వైసీపీలో చేరారు.వైసీపీలో 2019 ఎన్నికల్లో టికెట్ తనకే దక్కుతుందని సుబ్బారాయుడు ఆశలు పెట్టుకున్నా, జగన్ మాత్రం ప్రసాదరాజు వైపు మొగ్గు చూపారు.
అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు కీలక పదవి దక్కుతుందని భావించిన సుబ్బరాయుడు కు ఇప్పటికీ నిరాశే ఎదురవుతోంది .
దీనికితోడు నరసాపురం మునిసిపల్ కోఆప్షన్ సభ్యుడి గా తన అనుచరుడికి అవకాశం ఇవ్వాలని సుబ్బారాయుడు పట్టుబట్టినా, ప్రసాదరాజు పట్టించుకోకపోవడం, తనకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తుండటం, అలాగే వైసిపి అధిష్టానం సైతం పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తూ ఉండడం వంటి కారణాలతో తన అసంతృప్తిని ఈ విధంగా బయట పెట్టుకున్నట్టుగా అర్థం అవుతోంది.అయితే ఈ వ్యవహారాలు పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉండడంతో పాటు, పార్టీ కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం దీనిపై వివరణ కోరినట్లు తెలుస్తోంది.చెప్పుతో కొట్టుకుని తన అసంతృప్తి వెళ్లగక్కిన.
సుబ్బారాయుడు బాధ ను వైసిపి అధిష్టానం గుర్తిస్తుందో లేక శిక్ష వేస్తుందో ?
.