కాంగ్రెస్ లో మరో పాదయాత్ర ! ఇప్పుడు 'భట్టి ' వంతు 

తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచుతుంది.రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు, బిజెపిని ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.

 Tcongress Clp Leader Mallu Bhatti Vikramarka Planning For Padayatra Details, Tel-TeluguStop.com

ఇప్పటి వరకు సీనియర్ నాయకులు మధ్య లేకపోవడం,  ఒకరి కార్యక్రమాలకు మరొకరు దూరంగా ఉంటూ , ఎవరికి వారే అన్నట్లుగా కాంగ్రెస్ లో పరిస్థితి ఉండేది.కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్ రావు ఠాక్రే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

అసంతృప్త నేతలను ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ  ఒక గాడిలో పెట్టారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అంతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే నెల తొలి వారంలో అదే పేరుతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క యాత్రను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.బాసర నుంచి ఈ యాత్రను మొదలుపెట్టి రోజుకో నియోజకవర్గం చొప్పున 35 నియోజకవర్గాల మీదుగా యాత్రను కొనసాగించే విధంగా భట్టి రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుంటున్నారు.ఈ మేరకు నిన్ననే సిఎల్పీ కార్యాలయంలో బట్టి విక్రమార్క ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితరులు

Telugu Aicc, Hathse, Mallubhatti, Pcc, Revanth Reddy-Politics

ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఏర్పాట్లపై చర్చించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు,  కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా యాత్రను కొనసాగించి ఖమ్మంలో భారీగా ముగింపు సభను నిర్వహించాలని , ఈ సభకు అవసరమైతే కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ను ఈనెల ఆరో తేదీన ప్రారంభించారు.దీంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పాల్గొని తమ ఐక్యమత్యాన్ని చాటి చెప్పారు.అయితే ఈ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొనలేకపోయారు.

Telugu Aicc, Hathse, Mallubhatti, Pcc, Revanth Reddy-Politics

అసెంబ్లీ సమావేశాలు కారణంగా ఆయన రేవంత్ యాత్రకు దూరంగా ఉన్నారు.కాకపోతే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత భద్రాచలం నియోజకవర్గం లో జరిగిన యాత్రలో పాల్గొననున్నారు.హత్ సే హత్ జోడో యాత్రను రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఓవైపు రేవంత్ యాత్ర చేపడుతుండగా, మరోవైపు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో యాత్రలు చేయడం ద్వారా వీలైనంత త్వరగా యాత్రను ముగించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నిర్ణయించుకోవడంతోనే, రేవంత్ తో పాటు ఇప్పుడు భట్టి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube