న్యూయార్క్ : విద్వేష నేరాలపై పోరాడుతోన్న భారత సంతతి చట్టసభ సభ్యురాలు

న్యూయార్క్‌లోని సౌత్ రిచ్‌మండ్ హిల్‌లో వున్న భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఇరు దేశాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో అమెరికాలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీ కూడా ఈ చర్యను ఖండిస్తూ.

 Indian-american Lawmaker Jenifer Rajkumar Successfully Tackles Hate Cases,jenife-TeluguStop.com

దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.దీనికి సంబంధించి భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడిని నెక్‌రోడ్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్ (27) అనే వ్యక్తిగా గుర్తించారు.క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ప్రకారం.

అతను కారులో తప్పించుకునే యత్నం చేసినట్లుగా తెలుస్తోంది.సింగ్ నేరం రుజువైతే అతనికి 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.భారత సంతతికి చెందిన న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్ … గాంధీ విగ్రహం వద్ద జరిగిన రెండు విద్వేషపూరిత నేరాల ఘటనలను విజయవంతంగా పరిష్కరించిన ఘనత పొందారు.

కంటికి కన్ను సూత్రం ప్రపంచం మొత్తాన్ని అంధుడిని చేస్తుందన్న గాంధీ తత్వానికి అనుగుణంగా పట్టుబడిన నేరస్థుడిని కఠినంగా శిక్షించాలని జెనిఫర్ కోరలేదు.యూఎస్‌లో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.నేరస్థులను త్వరగా పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.జెనిఫర్ రాజ్‌కుమార్… న్యూయార్క్ రాష్ట్రంలో ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యురాలు.

Telugu Gandhi Statue, Indianamerican, York Assembly, Newyork, Tulsi Mandir-Telug

కాగా.ఆగస్ట్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు రెండు కార్లలో అక్కడికి వచ్చి స్లెడ్జ్ హామర్ సాయంతో గాంధీ విగ్రహాన్ని కూల్చివేసి దానిని ముక్కలు చేశారు.అక్కడితో ఆగకుండా 111వ స్ట్రీట్ టెంపుల్ వద్ద రహదారిపై కుక్క అనే అర్థం వచ్చేలా పిచ్చిరాతలు రాశారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.మరో ఘటన విషయానికి వస్తే… సౌత్ రిచ్‌మండ్ హిల్‌లోని తులసి మందిర్‌ను, సిక్కు కల్చరల్ సొసైటీని న్యూయార్క్ పోలీస్ చీఫ్ సందర్శించిన తర్వాత జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube