ఢిల్లీలో రేపు బీజేపీ ( BJP )రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఈ మేరకు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార కార్యక్రమాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితి ఉందని పేర్కొన్నారు.బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS, Congress )ఒక్కటయ్యాయన్నారు.ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికలకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు.