నేటి రోజుల్లో గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది.అందుకే గుప్పెడంత గుండెపై కాస్తైన శ్రద్ధ వహించాలని, దాని ఆరోగ్యం కోసం పోషకాహారాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంటారు.
అయితే గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.వాటిలో బొప్పాయి కూడా ఒకటి.
బొప్పాయి పండు మధురమైన రుచితో పాటు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.
అందుకే ఇది ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
అయితే బొప్పాయిని డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను కూడా తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లి పోదాం పదండీ.

ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో మూడు బాదం పప్పులు, రెండు అంజీర్ పండ్లు వేసి వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.అలాగే మరోవైపు ఒక చిన్న బొప్పాయి పండు తీసుకుని పైతొక్క, లోపల ఉన్న గింజలు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు, నానబెట్టుకున్న బాదం, అంజీర్, వన్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్, రెండు యాలకులు, రెండు కప్పుల ఫ్యాట్ లెస్ మిల్క్, మూడు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే బొప్పాయి స్మూతీ సిద్ధం అవతుది.ఈ స్మూతీని గ్లాస్‌లోకి సర్క్ చేసుకుని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ సమయంలో తీసుకోవాలి.రెండు, మూడు రోజులకు ఒక సారి ఇలా చేస్తే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.తద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ బొప్పాయి స్మూతీని డైట్‌లో చేర్చుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది.మరియు రక్తహీనత సమస్య సైతం తగ్గుముఖం పడుతుంది.







