సెంచరీ చేసి టీమ్ ఇండియాను గెలిపించిన శ్రేయస్ అయ్యర్..

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న సౌత్ ఆఫ్రికా తో మొదటి వన్డేలో ఓడిపోయిన టీమ్ ఇండియా, రెండో వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.శ్రేయస్ సెంచరీ చేసిన వేళ ఇండియా సిరీస్ 1-1తో సమం చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50ఓవర్లకు 7వికెట్లు కోల్పోయి 278పరుగులు చేసింది.279పరుగుల లక్ష్యాన్ని మరో 25బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించి 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 Shreyas Iyer Scored A Century And Won The Team India , Shreyas Iyer,cricket,indi-TeluguStop.com

బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌లో 279పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించిందంటే అందుకు ప్రధానంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ కారణం.ఇషాన్ కిషన్ 93పరుగులు 84బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు, శ్రేయస్ అయ్యార్ 113పరుగులు 111బంతుల్లో 15ఫోర్లు నాటౌట్ గా చివరి వరకు అడి జట్టు కు విజయాన్ని అందించాడు.

279 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ 13పరుగులు చేసి పార్నెల్ వేసిన 6వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.అయితే మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 28పరుగులు 26బంతుల్లో 5ఫోర్లు క్రిజ్ లో ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు.

అయితే రబాడా గిల్‌ను పెవిలియన్ పంపిన తర్వాత టీమిండియా, 48పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ వీరిద్దరూ కుదురుకునేదాకా కుదురుగా ఆడుతూ,శ్రేయస్ అయ్యార్‌కు స్ట్రైక్ ఇవ్వగా అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్ రేట్ పెరగకుండా చూసుకున్నాడు.

ఇక కిషన్ ఔటయ్యాక సంజూ శాంసన్ 30పరుగులు చేసి నాటౌట్ తో ఇన్నింగ్స్ నడిపించాడు.అయితే శ్రేయస్ 98పరుగుల వద్ద ఉన్నప్పుడు 43వ ఓవర్లో రబాడా నోబాల్ వేయడంతో ఫ్రీ హిట్ బంతిని ఫోర్ బాదిన తన సెంచరీని పూర్తి చేశాడు.చివరికి శ్రేయస్ బౌండరీ తో భారత్ కు విజయనందించాడు.

సిరాజ్ తన 10ఓవర్ల కోటాలో 3వికెట్లు తీసి ఒక మెయిడిన్ సహా 38పరుగులు ఇచ్చి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube