సాధారణంగా చాలామంది దర్శకులు తమ సినిమాల్లో ఎప్పుడూ ఒకటో రెండో క్యారెక్టర్ లు ఒకే నటులతో రిపీట్ చేస్తూనే ఉంటారు.అందుకు గల ముఖ్య కారణం ఆ నటీనటుల తో వారికి ఉన్న సాన్నిహిత్యమే అనుకోవచ్చు.
మరొక విషయం ఏమిటంటే వారు ఎక్కడ కూడా నటన విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు.అందుకే వారితోనే సదరు దర్శకులు ట్రావెల్ అవుతూ ఉంటారు.
అలా టాలీవుడ్ లో దాదాపు అందరి దర్శకులు తమ సినిమాలో కొంతమందిని రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉంటారు.ప్రస్తుతం కల్కి సినిమా హావా బాగా నడుస్తుంది ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్( Nag Ashwin ) సైతం ఇందుకు మినహాయింపు కాదు.
ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక హీరోయిన్ ని ప్రతి చిత్రంలో తీసుకుంటూ ఉన్నారు.
![Telugu Kalki Ad, Mahanati, Malvika Nair, Nag Ashwin, Nani, Tollywood-Movie Telugu Kalki Ad, Mahanati, Malvika Nair, Nag Ashwin, Nani, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/Yevade-Subramanyam-tollywood-Nag-Ashwin-nani-tollywood-Mahanati-Malvika-Nair-Kalki-2898-AD.jpg)
ఇంతకీ నాగ్ అశ్విన్ ప్రతిసారి తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు మాళవిక నాయర్( Malvika Nair ).ఈమె నాగ్ అశ్విన్ నటించిన అన్ని సినిమాల్లో ఉండడం విశేషం. నాగ్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం( Yevade Subramanyam ) లో నాని సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా మహానటి.
ఇందులో జెమినీ గణేషన్ మొదటి భార్య పాత్రలో ఆమె నటించింది.ప్రస్తుతం కల్కి సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నాడు నాగ్.
ఇలా తన దర్శకత్వంలో వస్తున్న ప్రతి సినిమాకి మాళవికకు ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు.
![Telugu Kalki Ad, Mahanati, Malvika Nair, Nag Ashwin, Nani, Tollywood-Movie Telugu Kalki Ad, Mahanati, Malvika Nair, Nag Ashwin, Nani, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/every-movie-Yevade-Subramanyam-tollywood-Nag-Ashwin-nani-tollywood-Mahanati.jpg)
మాళవిక నాయర్ కెరీర్ కూడా అడపాదడప బాగానే సాగుతోంది.2023 సంవత్సరానికి 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే చిత్రంతో పాటు డెవిల్ మరియు అన్ని మనిషి శకునములే చిత్రాలలో నటించినా పెద్దగా కలిసి రాలేదు.
ఇక ఈ ఏడాది కల్కి తో పాటు మరో కన్నడ సినిమాలో మాళవిక కనిపిస్తోంది.చాలా ఏళ్లుగా మాళవిక హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికి ఆమెకు ఎందుకో సరైన పాత్రలు దొరకడం లేదు.
కాకపోతే ఈమె మంచి నటి అని మాత్రం చెప్పక తప్పదు.తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రస్తుతం మాలవిక బిజీగా ఉంటుంది.