చైనా ( China )మూలాలున్న 67 ఏళ్ల మహిళకు భారత జాతీయతతో పాస్‌పోర్ట్ జారీ చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.ఆమె పెద్ద కుమారుడు న్యూజిలాండ్ లోని అక్లాండ్‌లో నివసిస్తూ ఆ దేశ ప్రభుత్వ పౌరసత్వం పొందారు.
అతనికి ఇప్పటికే ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డ్( Overseas Citizenship of India ) సైతం ఉంది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కేంద్ర నిఘా సంస్థలు సమర్పించిన అత్యంత గోప్యమైన రహస్య నివేదికలో రిట్ పిటిషనర్ వాంగ్ ముయ్ చీన్‌పై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు కనిపించకపోవడంతో జస్టిస్ అనితా సుమంత్ పై విధంగా తీర్పు వెలువరించారు.
అన్ని సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాత జనవరి 26, 1950… జూలై , 1987 మధ్య భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 3(1)(ఏ) ప్రకారం జన్మత పౌరసత్వానికి అర్హులని జస్టిస్ సుమంత్ పేర్కొన్నారు.1967 పాస్‌పోర్ట్‌ల చట్టంలో ప్రత్యేక పరిస్ధితులు, సంఘటనల విషయంలో తగిన రక్షణలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.అనంతరం నాలుగు వారాల్లోగా పిటిషనర్‌కు పాస్‌పోర్ట్ ఇవ్వాలని చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని జస్టిస్ అనితా సుమంత్ ఆదేశించారు.పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వి.ప్రకాష్ , గౌతమ్ ఎస్ రామన్‌లు వాదనలు వినిపించారు.పిటిషనర్ తండ్రి వాంగ్ త్సమ్ చా చైనా( China )లో జన్మించారని, తన జీవనాన్ని కొనసాగించడానికి భారతదేశానికి వలస వచ్చారని వాదించారు.
అతను సిక్కింలో జన్మించిన , లెప్చా కమ్యూనిటీకి చెందిన పిటిషనర్ తల్లిని వివాహం చేసుకున్నాడని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.మొదట్లో పిటిషనర్ తన తల్లి భూటాన్( Bhutan )లో పుట్టిందని తప్పుగా క్లెయిమ్ చేసినా, తర్వాత దానిని సరిదిద్దారు.
ఆమె తల్లిదండ్రులు కోల్‌కతాలో వివాహం చేసుకోగా.నవంబర్ 27, 1957న పిటిషనర్ జన్మించారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ నవంబర్ 8, 1976న ఈ మేరకు బర్త్ సర్టిఫికేట్‌ను సైతం జారీ చేసింది.
అయితే 1976 నాటి బర్త్ సర్టిఫికేట్‌లో జాతీయత/ జననం అనే కాలమ్‌లో పిటిషనర్‌ను చైనీస్ బౌద్దుడని పేర్కొన్నారు.దీని కారణంగా చాలా ఏళ్లుగా ఆమె పాస్‌పోర్ట్ పొందేందుకు అడ్డంకిగా మారడంతో .తిరిగి 2013లో ఆమె కోల్‌కతా కార్పోరేషన్ నుంచి మరొక బర్త్ సర్టిఫికేట్ పొందింది.ఈలోగా పిటిషనర్ 1976లో లి వెన్ఫాను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు.వీరికి నలుగురు పిల్లలు.పెద్దకుమారుడు న్యూజిలాండ్ , చిన్న కుమార్తె యునైటెడ్ కింగ్‌లో నివసిస్తుండగా.ఇద్దరు పిల్లలు భారతీయ పాస్‌పోర్టులను కలిగి ఉన్నట్లుగా న్యాయవాదులు తెలిపారు.
పిటిషనర్ తండ్రి 1991లో , భర్త 2021లో కన్నుమూశారు.ఆధార్, పాన్, రేషన్ కార్డులను కలిగి ఉన్నప్పటికీ.
భారతీయ పాస్‌పోర్ట్ కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తులు 2007 నుంచి తిరస్కరణకు గురవుతున్నాయి.కేవలం బర్త్ సర్టిఫికెట్‌లో చైనీస్ బౌద్ధ ప్రస్తావణ కారణంగా ఆమెకు పాస్‌పోర్ట్ మంజూరు కావడం లేదు.