అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఆ హీరోయిన్ కు నెటిజన్లు భారీ షాకిచ్చారుగా!

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇందుకోసం కొంతమంది హీరోయిన్లు సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు.

 Richa Chadha Older Ladies Saying They Are Natural After 10 Surgeries, Richa Chad-TeluguStop.com

సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు.అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు.

అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో మనందరికీ తెలిసిందే.చాలామంది ఇదే విషయాల గురించి బహిరంగంగానే తెలిపారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయం గురించి బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా ( Richa Chadha )సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.మరేం లేదు.కొందరికి ఒంటినిండా విషమే! వయసు ‍పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు.పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు.అక్కా.మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి.అన్నీ చూస్తున్నాం.

కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు.ప్లాస్టిక్‌ సర్జరీ( Plastic surgery ) చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది.

కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు.కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube