వైసీపీ అధినేత వైఎస్ జగన్( Ys Jagan ) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.దాదాపు మూడు రోజుల నుండి పులివెందులలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు.
ఇదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను వింటున్నారు.ఈ క్రమంలో అక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నారు.
ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలలో ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.దీంతో వైయస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కమిటీలు వేయడం జరిగింది.
ఇదే సమయంలో ఓడిపోయిన నాయకులతో భేటీ అయి.దాడులకు గురైన పార్టీ కార్యకర్తలను కలవబోతున్నట్లు తెలియజేశారు.స్వయంగా తానే వచ్చి ఇబ్బందులకు గురైన కార్యకర్తలను పరామర్శిస్తానని మాట ఇవ్వటం జరిగింది.
ఇదిలా ఉంటే పులివెందులలో పార్టీ కార్యకర్తలు నాయకులతో భేటీ అయిన సమయంలో వైయస్ జగన్ కీలక సూచనలు చేసినట్లు.వైసీపీ సోషల్ మీడియా( Social media ) విభాగం సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.“పులివెందులలో వైయస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మూడో రోజు పర్యటన..పులివెందుల( Pulivendula )లోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు.అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు.
కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ భరోసానిచ్చారు”.
అని వైసీపీ సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేయడం జరిగింది.