మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ కి షాక్... రాజీనామా చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సర్కార్ ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.ప్రస్తుతం ఓ వైపు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది.

 Mla Prakash Solanke Cabinet Expansion Ncp-TeluguStop.com

అనేక నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ సపోర్ట్ తో మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న శివసేనకి అప్పుడే గండం మొదలైనట్లు ఉంది.ఓ వైపు మంత్రి వర్గ విస్తరణ జరుగుతూ ఉండగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కూటమికి షాక్ ఇచ్చాడు.

మంత్రి వర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రకాష్ సోలంకే షాక్ ఇవ్వడం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుందో మొన్నటి వరకు కర్ణాటకలో చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు అలాంటి పరిస్థితే మహారాష్ట్రలో కూడా ఉంది.అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి షాక్ ఇస్తూ మిత్ర పక్షంగా ఉన్న శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు.

అయితే ప్రభుత్వాన్ని దించడానికి తన రాజకీయ చతురతని ప్రదర్శించే బీజేపీ వేచి చూస్తూనే ఉంటుంది.అయితే సోలంకే రాజీనామా చేయడం బీజేపీ ఎత్తుగడ అని భావించిన అతను మాత్రం వేరే విధంగా చెప్పడం విశేషం.

మంత్రివర్గ విస్తరణ తర్వాత తాను రాజకీయాలకు పనికిరానని అర్థమైనదని సోలంకే పేర్కొన్నారు.సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది.

అయితే తనకి మంత్రి పదవి రాకాపోవడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube