యువగళం ముగింపు సభ "నవశకం" కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

యువగళం ముగింపు సభ "నవశకం"( Navasakam ) కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు( Chandrababu Naidu ) అభినందించారు.

విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా అందరం ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.తన రాజకీయ జీవితంలో ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో చాలా పాదయాత్రలు జరిగాయి.అయితే ఎప్పుడూ కూడా పాదయాత్రలపై దండయాత్ర జరగలేదు.

కానీ మొట్టమొదటిసారి జగన్( Jagan Mohan Reddy ) పాలనలో పాదయాత్ర పై దాడులు జరిగాయి అని చంద్రబాబు ఆరోపించారు.పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించారు.

Advertisement

ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.అయినా గాని లోకేష్( Nara Lokesh ) 226 రోజులు.

పాదయాత్ర చేసి దిగ్విజయంగా ముగించారు అని ప్రశంసించారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా జగన్ విధివిధానాలపై నిర్ణయాలపై చంద్రబాబు మండిపడ్డారు.

ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్( Job Calendar ) రిలీజ్ చేస్తానని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.యువత జీవితాన్ని నాశనం చేయడం జరిగింది.వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది.భూకబ్జాలు ఎక్కువైపోయాయి.అని చంద్రబాబు విమర్శించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
1980లో అమెరికాకి వలస వెళ్లిన భారతీయ మహిళ.. ఇప్పుడు ఎలా ఉందంటే..

అంతేకాదు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ అని హామీ ప్రకటించారు.రాబోయే రోజుల్లో అమరావతి అదేవిధంగా తిరుపతిలో సభలు పెడతాం.అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం.18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల సాయం చేస్తామని యువగళం ముగింపు సభ "నవశకం" కార్యక్రమంలో చంద్రబాబు హామీలు ప్రకటించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు