శ్రీ రాజ్ బళ్లా దర్శకత్వంలో నటుడు నందకిషోర్, సిరి జంటగా నటించిన సినిమా నరసింహపురం. సిస్టర్ సెంటిమెంటుతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 30,2021 లో విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలపై, హీరోలపై ఉన్న కంప్లైంట్ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు, ఎప్పుడూ పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకుంటారని కంప్లైంట్ ఉంది.
ఇక తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది తన సినిమా విషయంలో సిరి ఎలా ప్రవర్తించిందో చెప్పుకొచ్చాడు నందకిషోర్.సిరి హనుమంతు మంచి నటి.సినిమాలు కూడా బాగా నటించింది కష్టపడిందని తెలిపారు.ఇక తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వమంటారు, ఇదిగో అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన తెలిపారు నందకిషోర్.
సిరి సినిమా ప్రమోషన్ కి రమ్మని చెప్పగా అందుకు సిరి నేను రానని చెప్పిందట.దీంతో ఆమెను ఎక్కువగా ఫోర్స్ చేయలేకపోయాము ఎందుకంటే తన రీసన్స్ తనకు ఉంటాయని తెలిపారు నందకిషోర్.
ఇక సిరికి ట్రైలర్ లో కంటెంట్ నచ్చకపోవడంతో రానని చెప్పిందట.

ఒక హీరోయిన్ గా సినిమా ప్రమోషన్ కి రావడం అనేది తన బాధ్యత.దానికి ఫోర్స్ చేయలేము.మెయిన్ లీడ్ కాబట్టి తనంతట తాను చేస్తే బాగుండేది.
ఎందుకంటే ఒక సినిమాకి మంచి పేరు వచ్చింది అంటే అందులో హీరో, హీరోయిన్ లే కీలకం.సినిమా ఒకసారి చూస్తే ఆమెకి తన క్యారెక్టర్ ని దర్శకుడు ఎంత బాగా చూపించాడో అర్థమవుతుంది.
ఇప్పటికీ ఈ సినిమా చూసి ఉండదు ఒకవేళ చూస్తే తన అభిప్రాయం మారవచ్చు కేవలం ట్రైలర్ ను చూసి ప్రమోషన్స్ కి రాను అనడం పద్ధతిగా అనిపించలేదు అంటూ నరసింహపురం వివాదం గురించి చెప్పుకొచ్చాడు నందకిషోర్