ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిలిం దర్శకులు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు.తమ టాలెంట్ ని ముందుగా చిన్న చిత్రాలలో చూపించుకొని తరువాత నిర్మాతలని, హీరోలని ఆకర్షిస్తూ వెండితెరపై నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు.
డిఫరెంట్ కథలతో హీరోలని మెప్పిస్తూ సత్తా చాటుతున్నారు.తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, ప్రశాంత్ వర్మ, విరంచి వర్మ లాంటి దర్శకులు అందరూ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి అక్కడ సక్సెస్ అయ్యి వెండితెరపైకి వచ్చినవారే కావడం విశేషం.
ఇప్పుడు ఈ దారిలో మరో టాలెంటెడ్ దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.మనసానమః అనే షార్ట్ ఫిలింతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ కి యూవీ కాన్సెప్ట్స్ టీమ్ పిలిచి అవకాశం ఇచ్చింది.
దీంతో ఓ మంచి కథని వారికి చెప్పి మెప్పించాడు.

ఇక ఇదే కథని శర్వానంద్ కి కూడా వినిపించి మెప్పించడంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.రీసెంట్ గా ఎక్ మినీ కథతో గ్రాండ్ విక్టరీ కొట్టిన యూవీ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవీగా దీపక్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనుంది.రీసెంట్ గా కిషోర్ అనే షార్ట్ ఫిలిం దర్శకుడుతో శ్రీకారం అనే మూవీని శర్వానంద్ చేసి డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు దీపక్ రెడ్డితో కూడా అలాంటి హిట్ సొంతం చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం మూవీతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్ళు మీకుజోహార్లు సినిమాలు చేస్తున్నారు.