ప్రస్తుత వర్షాకాలంలో జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవడం అంటే కత్తి మీద సామే.ఎంత ఖరీదైన షాంపూలు, కండీషనర్స్, ఆయిల్స్, సీరమ్స్ వాడినా.
హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, వైట్ హెయిర్ వంటి సమస్యలు సతమతం చేస్తూనే ఉంటాయి.కానీ, ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టిప్స్‌ను ట్రై చేస్తే మీ కురులు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడటం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.
ఫ్రూట్ జ్యూసులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా యాపిల్ మరియు ఆరెంజ్ జ్యూస్‌లు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.ఒక ఆరెంజ్‌ను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేయండి.
అలాగే ఒక యాపిల్ పండును తీసుకుని ముక్కలుగా కట్ చేయండి.ఆ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేయాలి.
ఈ యాపిల్ జ్యూస్ లో ఆరెంజ్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేయండి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో మెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.చుండ్రు పోతుంది.
జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, గ్లాస్ వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి.ఉదయాన్నే వాటిని వాటర్‌తో సహా గ్రైండ్ చేసి.జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌ను తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట లేదా గంటన్నర తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
కురులు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడతాయి.