ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై సీరియస్ కామెంట్లు చేశారు.గతంలో ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీ చేస్తాం అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.
రుణాలు యెగ్గోటారని.అదే సమయంలో చంద్రబాబు మాట ఇవ్వటంతో అక్కా చెల్లెమ్మలు.
రుణాలు కట్టకపోవడంతో.చివరాకరికి రుణభారం పెరిగిపోయి.
వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇప్పుడు ఆ రుణ భారాలు మొత్తం వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తుందని.
గత నాలుగు దఫాలుగా చేలించుకుంటూ వస్తుందని.వైయస్ జగన్ స్పష్టం చేశారు.
2014 ఎన్నికల టైంలో చంద్రబాబు అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని అప్పుడే సద్దుమణిగేది అని చెప్పుకొచ్చారు.చంద్రబాబు వల్ల ఏ గ్రేడ్ లో ఉన్న ద్వాక్రా సంఘాలన్నీ సీ గ్రేడ్ లోకి పడిపోయాయని విమర్శించారు.
వైయస్సార్ చేనేత ఆసరా పథకాలకు సంబంధించి సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి విడత ఆసరా కింద 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపులకు రూ.6,330.58 కోట్లు చెల్లించామని తెలిపారు.రెండో విడత ఆసరా కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.వ్యాపార రంగంలో కూడా మహిళలు రాణించేలా ప్రముఖ కంపెనీలను భాగస్వామ్యం చేసినట్లు స్పష్టం చేశారు.